Sunday, November 16, 2025
Homeచిత్ర ప్రభJagapathi Babu: శ్రీతేజ్‌ను పరామర్శించా..పబ్లిసిటీ చేసుకోలేదు: జగపతిబాబు

Jagapathi Babu: శ్రీతేజ్‌ను పరామర్శించా..పబ్లిసిటీ చేసుకోలేదు: జగపతిబాబు

సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో బాధిత రేవతి కుటుంబాన్ని సినీ ప్రముఖులు పరామర్శించలేదని సీఎం రేవంత్ రెడ్డి విమవర్శించిన సంగతి తెలిసిందే. దీనిపై తాజాగా సినీ నటుడు జగపతిబాబు(Jagapathi Babu) స్పందించారు. బాలుడు శ్రీతేజ్‌ను ఆసుపత్రిలో పరామర్శించానని.. కానీ పబ్లిసిటీ చేసుకోలేదన్నారు. ఈ మేరకు సోషల్‌ మీడియాలో ఓ వీడియో విడుదల చేశారు.

- Advertisement -

‘‘సినిమా షూటింగ్‌ ముగించుకుని నేను ఊరి నుంచి రాగానే.. బాధిత కుటుంబాన్ని పరామర్శించేందుకు హాస్పిటల్‌కు వెళ్లా. చికిత్స పొందుతున్న బాలుడి తండ్రిని, సోదరిని పలకరించాలని అనిపించి అక్కడకు వెళ్లా. అందరి ఆశీస్సులతో త్వరగానే కోలుకుంటాడని వారికి భరోసా ఇచ్చా. అందరికంటే ఎక్కువ ఎఫెక్ట్‌ అయింది ఆ కుటుంబం కాబట్టి నా వంతు సపోర్టు ఇవ్వాలనుకున్నా. దానికి పబ్లిసిటీ చేయలేదు. అందుకే ఎవరికీ ఆ విషయం తెలియలేదు. దానిపై క్లారిటీ ఇవ్వడానికే ఈ పోస్టు’’ అని ఆయన తెలిపారు.

కాగా మరోవైపు అల్లు అర్జున్ ఇంటిపై ఓయూ విద్యార్థి జేఏసీ నాయకులు దాడికి పాల్పడ్డారు. రేవతి కుటుంబానికి న్యాయం చేయాలంటూ డిమాండ్ చేశారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad