Sunday, November 16, 2025
HomeTop StoriesJr NTR: 'దేవర' టీవీ ప్రీమియర్ డేట్ ఫిక్స్! ఏడాది నిరీక్షణకు శుభం కార్డు పడింది!

Jr NTR: ‘దేవర’ టీవీ ప్రీమియర్ డేట్ ఫిక్స్! ఏడాది నిరీక్షణకు శుభం కార్డు పడింది!

Devara: యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ చాలా కాలంగా ఎదురుచూస్తున్న ‘దేవర పార్ట్ 1’ వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్‌పై తాజాగా ఒక అధికారిక ప్రకటన వచ్చింది. థియేటర్లలో విడుదలై సరిగ్గా ఒక సంవత్సరం గడిచిన తర్వాత, ఈ భారీ ప్రాజెక్ట్ టీవీలోకి వచ్చేందుకు సిద్ధమైంది.

- Advertisement -

కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిన ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్‌లో ఎన్టీఆర్ పవర్ ప్యాక్డ్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. ఈ సినిమా ద్వారా టాలీవుడ్‌కి పరిచయమైన జాన్వీ కపూర్ స్టెప్పులతో అదరగొట్టింది, పవర్ ఫుల్ విలన్‌గా నటించిన సైఫ్ అలీ ఖాన్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు. ఈ సినిమాకు అనిరుధ్ అందించిన మ్యూజిక్ గాని బ్యాగ్రౌండ్ స్కోర్ గాని సినిమాని మరొక స్థాయికి తీసుకువెళ్లాయి.

ALSO READ: https://teluguprabha.net/cinema-news/tollywood-diwali-2025-new-directors-debut/

భారీ డీల్‌తో తెర లేపిన స్టార్ గ్రూప్

ఈ మధ్య కాలంలో ఏ సినిమా కూడా టీవీ ప్రీమియర్ కోసం ఏడాది పాటు ఆగింది లేదు. కానీ, ‘దేవర’ మాత్రం ఈ విషయంలో ప్రత్యేకంగా నిలిచింది. ఇండస్ట్రీ లో సమాచారం ప్రకారం, సినిమా క్వాలిటీ, ఎన్టీఆర్ పాన్-ఇండియా మార్కెట్ విలువ కారణంగా, హక్కుల డీల్‌కు భారీ చర్చలు జరిగాయి.ఎట్టకేలకు, జియో స్టార్ (Jio Star) ఈ శాటిలైట్ హక్కులను కొనుగోలు చేసి, ఈ సస్పెన్స్ కు తెర దించింది.

సాధారణంగా తెలుగు సినిమాలు ముందుగా తెలుగులోనే ప్రీమియర్ అవుతాయి. కానీ, ఈసారి కొత్తగా హిందీ వెర్షన్ ప్రీమియర్ డేట్‌ను ముందుగా ప్రకటించారు. హిందీ వెర్షన్ ప్రీమియర్ స్టార్ గోల్డ్ ఛానెల్‌లో 2025 అక్టోబర్ 26న రాత్రి 8 గంటలకు ప్రసారం కానుంది. కానీ, తెలుగు వెర్షన్ డేట్ ను మాత్రం రిలీజ్ ఇంకా రిలీజ్ చెయ్యలేదు.

ALSO READ: https://teluguprabha.net/cinema-news/sai-dharam-tej-allu-arjun-controversy/

ప్రస్తుతం, ఎన్టీఆర్ తన తదుపరి ప్రాజెక్ట్, ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందనున్న ‘డ్రాగన్’ (వర్కింగ్ టైటిల్) సినిమాను పూర్తి చేయనున్నారు. ఆ వెంటనే, ‘దేవర 2’ షూటింగ్‌ను పట్టాలెక్కించడానికి సన్నాహాలు జోరుగా సాగుతున్నాయి.

మొత్తానికి ఏడాది నిరీక్షణ తర్వాత దేవర దర్శనం కలగనుంది బుల్లితెర ప్రేక్షకులకు. మరి చూడాలి బుల్లితెర పై దేవర వేట ఎలా ఉంటుందో

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad