ఈరోజు ఎపిసోడ్లో శౌర్య గురించి జ్యోత్స్న చెప్పిందని తననేమి అనద్దు అంటుంది. నా మీద నమ్మకం ఉంచి నువ్వు దైర్యంగా ఉండు నేను చూసుకుంటాను అంటాడు. ఆపరేషన్‌కు ఎవరు ఇస్తారు డబ్బులు అని అడుగుతుంది దీప. మరోవైపు సుమిత్ర బాధపడుతుంటే దశరథ వచ్చి బాధపడకూ అంటాడు. దీపకి ఫోన్ చేసి మాట్లాడు అంటే చేస్తుంది కానీ ఎవరూ లిఫ్ట్ చేయరు. కాంచనకి చేసినా తను లిఫ్ట్ చేయదు. అప్పుడు ఇంకా ఎక్కువ బాధపడుతుంది సుమిత్ర.
మరోవైపు అనసూయ ఇల్లు అమ్మడానికి ప్రయత్నాలు చేస్తుంది. డబ్బులు ఇప్పుడు ఇవ్వడం అవ్వదు కావాలంటే వారం తర్వాత ఇస్తాం అంటారు. రూ.20 లక్షలు చేసే ఇళ్లు రూ.10 లక్షలకు ఇచ్చేస్తానన్నా ఎవరూ కొనడానికి రెడీగా ఉండరు. దానితో అనసూయ బాధపడుతూ ఇంకా ప్రయత్నాలు చేస్తుంది. మరోవైపు దీప శౌర్య గురించి ఆలోచిస్తుంది. డబ్బులు ఎవరు అయినా ఇచ్చారో లేదో మళ్లీ డబ్బుల విషయంలో అబద్దం చెప్పారేమో అని ఆలోచిస్తుంది. శౌర్యకు టిఫిన్ పెట్టి మళ్లీ వస్తాను అని బయటికి వెళ్తుంది. అక్కడ కార్తిక్ ఏమో డబ్బులు కోసం తెలిసిన వాళ్లు అందరికీ ఫోన్ చేస్తాడు. ఈలోగా డాక్టర్ వచ్చి ఇంకా డబ్బులు ఎందుకు కట్టలేదని వచ్చి అడుగుతాడు రేపు ఉదయం 11 గంటలకు డబ్బులు కట్టకపోతే ట్రీట్మెంట్ ఆపేస్తాను అంటాడు.
కార్తిక్ ఏమో ఎలా అయినా కట్టేస్తాను అంటాడు. చివరికి అనసూయ ఇంటికి వచ్చి ఎన్ని ప్రయత్నాలు చేసినా ఇల్లు అమ్మడానికి అవ్వలేదు, ఎవరిని అడిగినా ఇప్పుడు డబ్బులు ఇవ్వలేము అంటున్నారు అని కాంచనకు చెప్తుంది. కాంచన బాధపడుతూ ఏమి చేయాలి ఇప్పుడు అంటుంది. అక్కడ హాస్పిటల్‌కు దీప ఏడుపును చూడటానికి జ్యోత్స్న వస్తుంది. నీ కూతురు ఆపరేషన్‌కు డబ్బులు నేను ఇస్తాను అని చెప్తుంది. కానీ ఒక కండీషన్ మీద చేస్తాను అంటుంది. ఏంటి అని దీప అడిగితే కార్తీక్‌ను నాకు ఇచ్చేయాలని కండిషన్ పెడుతుంది. ఇంతటితో ఎపిసోడ్ పూర్తవుతుంది.