Saturday, October 5, 2024
Homeచిత్ర ప్రభKamal Haasan - K Viswanath :సాగర సంగమం కలిసింది.. స్వాతిముత్యం లాంటి కలయిక..

Kamal Haasan – K Viswanath :సాగర సంగమం కలిసింది.. స్వాతిముత్యం లాంటి కలయిక..

- Advertisement -

Kamal Haasan – K Viswanath : లెజెండరీ డైరెక్టర్ K విశ్వనాధ్, లోక నాయకుడు కమల్ హాసన్ ల కాంబినేషన్లో పలు మరుపురాని సినిమాలు వచ్చాయి. సాగర సంగమం, స్వాతిముత్యం, శుభసంకల్పం.. లాంటి సినిమాలు తెలుగు చిత్ర సీమలో క్లాసిక్స్ గా నిలిచిపోయాయి. డైరెక్టర్ K విశ్వనాధ్ ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటున్నారు. వయోభారంతో ఇంట్లోనే సమయం గడుపుతున్నారు.

ఇక లోకనాయకుడు కమల్ హాసన్ చాలా సంవత్సరాల తర్వాత ఇటీవలే విక్రమ్ సినిమాతో భారీ విజయం సాధించాడు. తాజాగా కమల్ హాసన్ హైదరాబాద్ రావడంతో కళాతపస్వి డైరెక్టర్ K విశ్వనాధ్ ని కలిశారు. వీల్ చైర్ లో ఉన్న ఆయన చేతిని తీసుకొని దండం పెట్టుకున్నారు. చాలా సంవత్సరాల తర్వాత కమల్, విశ్వనాథ్ కలవడంతో వీరి ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ కాంబినేషన్ ఎప్పటికి క్లాసిక్ అంటూ వీరిద్దర్నీ పొగుడుతూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News