Saturday, November 15, 2025
Homeచిత్ర ప్రభNelson: 40 ఏళ్ల తర్వాత కమల్, రజనీ... ఇక రికార్డుల సునామీ!

Nelson: 40 ఏళ్ల తర్వాత కమల్, రజనీ… ఇక రికార్డుల సునామీ!

Nelson: కోట్లాది మంది అభిమానులు దశాబ్దాలుగా కంటున్న కల ఎట్టకేలకు నిజం కాబోతోంది. మన సూపర్ స్టార్ రజనీకాంత్, లోకనాయకుడు కమల్ హాసన్ మళ్లీ ఒకే సినిమాలో కలిసి నటిస్తున్నారు. ఈ కలయికకు దర్శకత్వం వహించడానికి, ఇండియన్ బాక్సాఫీస్‌ను షేక్ చేసిన ‘జైలర్’ ఫేమ్ నెల్సన్ దిలీప్‌కుమార్ రంగంలోకి దిగుతున్నట్లు కోలీవుడ్ నుంచి స్ట్రాంగ్ న్యూస్ వస్తోంది.

- Advertisement -

ALSO READ: https://teluguprabha.net/cinema-news/rishab-shetty-makeup-transformation-for-kantara/

1970లలో రజనీకాంత్, కమల్ హాసన్ కలిసి దాదాపు 20 సినిమాల్లో నటించారు. ఆ తర్వాత ఇద్దరూ ఎవరికి వారు ‘సూపర్ స్టార్’, ‘లోకనాయకుడు’ అనే టైటిల్స్‌తో ఎవరి స్టార్‌డమ్ ని వాళ్ళు ఏర్పరుచుకున్నారు. ఇప్పుడు, 40 ఏళ్ల గ్యాప్ తర్వాత, వీరిద్దరూ కలిసి ఒకే స్క్రీన్‌పై కనిపించడం అంటే… అది కేవలం సినిమా కాదు, ఒక పండగ అని చెప్పాలి. వీరిద్దరిలో ఎవరు నెగ్గుతారు, ఎవరు తగ్గుతారు అనేది పక్కన పెడితే… ఇద్దరు లెజెండ్స్ ఒకే ఫ్రేమ్‌లో నిలబడితే థియేటర్ల పరిస్థితి ఏంటనే ఊహే అభిమానులకు పూనకాలు తెప్పిస్తోంది.

మొదట లోకేశ్ కనగరాజ్ ఈ సినిమా చేస్తారని అనుకున్నారు. కానీ, రజనీకాంత్‌కు ‘జైలర్’ తో బ్లాక్‌బస్టర్ ఇచ్చిన నెల్సన్ వైపే మొగ్గు చూపినట్టు సమాచారం. నెల్సన్ చెప్పిన కథ రజనీకాంత్‌ను బాగా ఇంప్రెస్ చేసిందట. పక్కా మాస్ ఎంటర్‌టైనర్ ఫార్మాట్‌లో, ఇద్దరి స్టైల్‌నూ బ్యాలెన్స్ చేస్తూ స్క్రిప్ట్ సిద్ధం చేశారని తెలుస్తోంది.
రజనీకాంత్ ప్రస్తుతం నెల్సన్ డైరెక్షన్ లోనే ‘జైలర్ 2’ సినిమా చేస్తున్నాడు. ఆ సినిమా కంప్లీట్ కాగానే, కమల్, రజనీ మల్టీస్టారర్‌పై అఫీషియల్ ప్రకటన రాబోతోంది. అంటే, ఇంకొన్ని నెలల్లోనే ఈ బిగ్ అనౌన్స్‌మెంట్ ఉండబోతోంది.

ALSO READ: https://teluguprabha.net/cinema-news/vamsi-paidipally-pawan-kalyan-new-movie-update/

ఈ ప్రాజెక్ట్‌ను కమల్ హాసన్ తన బ్యానర్ రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ పై నిర్మించే అవకాశం ఉంది. ఈ కాంబోకు దేశవ్యాప్తంగానే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న మార్కెట్‌ను దృష్టిలో పెట్టుకుని, ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో, హాలీవుడ్ స్థాయి టెక్నాలజీతో తెరకెక్కిస్తారని ఇండస్ట్రీ టాక్. రజనీకాంత్ స్వాగ్, కమల్ హాసన్ యాక్టింగ్… రెండూ ఒకేసారి చూడడం అంటే, ఇక థియేటర్లలో పండగే.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad