Monday, November 17, 2025
Homeచిత్ర ప్రభThuglife OTT: కమల్ హాసన్ 'థగ్ లైఫ్' ఓటీటీ విడుదలపై బిగ్గెస్ట్ అప్‌డేట్..!

Thuglife OTT: కమల్ హాసన్ ‘థగ్ లైఫ్’ ఓటీటీ విడుదలపై బిగ్గెస్ట్ అప్‌డేట్..!

- Advertisement -

Kamal’s thuglife movie in Ott: ప్రముఖ నటుడు కమల్ హాసన్ ప్రధాన పాత్రలో దిగ్గజ దర్శకుడు మణిరత్నం తెరకెక్కించిన చిత్రం ‘థగ్ లైఫ్’. జూన్ 5న ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన ఈ సినిమాలో అగ్ర తారలు కమల్ హాసన్, మణిరత్నం దాదాపు మూడు దశాబ్దాల తర్వాత మళ్ళీ జత కట్టడంతో భారీ అంచనాలను రేకెత్తించింది. అయితే విడుదలైన తర్వాత ఈ చిత్రం ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది.

ఓటీటీ డీల్‌లో మార్పులు:

‘థగ్ లైఫ్’ సినిమా విడుదలకు ముందే, ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను సొంతం చేసుకుంది. ప్రారంభంలో ఈ డీల్ దాదాపు రూ. 130 కోట్లుగా కుదిరినట్లు సమాచారం. సినిమా థియేట్రికల్ విడుదలైన ఎనిమిది వారాల తర్వాత స్ట్రీమింగ్ చేయాలని అగ్రిమెంట్ చేసుకున్నారు.

ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద నిరాశపరచడంతో, నెట్‌ఫ్లిక్స్ తమ ఒప్పందాన్ని పునఃపరిశీలించినట్లు తెలుస్తోంది. మొదట కుదుర్చుకున్న 8 వారాల గడువును 4 వారాలకు తగ్గించి, సినిమాను త్వరగా ఓటీటీలోకి తీసుకురావాలని నిర్ణయించారు. అంతేకాకుండా, స్ట్రీమింగ్ హక్కుల ధరను కూడా రూ. 110 కోట్లకు తగ్గించినట్లు సమాచారం. దీంతో నిర్మాతలు, కమల్ హాసన్ మరియు మణిరత్నం, దాదాపు రూ. 20 కోట్లు నష్టపోయినట్లు సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

జులై మొదటి వారంలో:

‘థగ్ లైఫ్’ జూలై మొదటి వారంలో నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్‌కు వచ్చే అవకాశం ఉందని సినీ వర్గాలు చెబుతున్నాయి. ఈ చిత్రంలో రంగరాయ శక్తిరాజు (కమల్ హాసన్) అనే గ్యాంగ్‌స్టర్ కథ ప్రధానంగా ఉంటుంది. అనుకోకుండా తండ్రిని కోల్పోయిన అమర్ (శింబు) అనే యువకుడిని శక్తిరాజు దత్తత తీసుకుని, తన ముఠాకు నాయకుడిగా చేస్తాడు. అయితే, దీన్ని ముఠాలోని ఇతర సభ్యులు జీర్ణించుకోలేకపోవడం, శక్తిరాజును అంతమొందించాలని వారు పన్నాగం పన్నడంతో కథ ఆసక్తికరంగా మారుతుంది. ఈ ఓటీటీ విడుదలపై మరింత సమాచారం వెలువడాల్సి ఉంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad