Saturday, November 15, 2025
Homeచిత్ర ప్రభKICCHA SUDEEP: స్టార్ హీరో కిచ్చా సుదీప్ ఇంట్లో తీవ్ర విషాదం

KICCHA SUDEEP: స్టార్ హీరో కిచ్చా సుదీప్ ఇంట్లో తీవ్ర విషాదం

KICCHA SUDEEP| కన్నడ సినీ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం నెలకొంది. సూపర్ స్టార్ కిచ్చా సుదీప్‌కి మాతృవియోగం కలిగింది. ఆయన తల్లి సరోజా సంజీవ్(8౩) బెంగళూరులోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. కొంతకాలంగా ఆమె వయసు సంబంధింత అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఇటీవల ఆమె శ్వాస తీసుకోవడంతో తీవ్ర ఇబ్బందులు పడటంతో హుటాహుటని ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స తీసుకుంటుండగా తుదిశ్వాస విడిచినట్లు సన్నిహిత వర్గాలు తెలిపాయి.

- Advertisement -

తల్లి మరణంతో సుదీప్ దిగ్భ్రాంతికి గురయ్యాడని చెబుతున్నారు. ఆమె మృతదేహాన్ని జేపీ నగర్‌లోని సుదీప్ ఇంటికి తీసుకురానున్నారు. కుటుంబసభ్యులు, సన్నిహితుల సందర్శనార్థం సాయంత్రం వరకు ఇంట్లోనే పార్థివదేహాన్ని ఉంచనున్నారు. అనంతరం సాయంత్రం 5 గంటలకు విల్సన్ గార్డెన్ శ్మశానవాటికలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ఈ విషయం తెలుసుకున్న పలువురు ప్రముఖులు సుదీప్‌ను పరామర్శించి ఆమె మృతి పట్ల సంతాపం ప్రకటించారు. మరోవైపు అభిమానులు కూడా తమ సంతాపం తెలియజేస్తున్నారు.

కాగా సుదీప్ ‘ఈగ’ సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. అనంతరం పలు సినిమాలను తెలుగులో డబ్బింగ్ చేసి పాపులర్ అయ్యాడు. ఈ క్రమంలోనే ఇటీవల వచ్చిన ‘విక్రాంత్ రోణ’ సినిమా తెలుగులోనూ మంచి విజయం సాధించింది. అలాగే హిందీలో సల్మాన్ ఖాన్ హీరోగా నటించిన ‘దబాంగ్ 3’ మూవీలోనూ నటించి అక్కడ కూడా గుర్తింపు తెచ్చుకున్నాడు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad