Kantara 1 Update: రిషబ్ శెట్టి హీరోగా 2022లో రిలీజైన కాంతార మూవీ బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు క్రియేట్ చేసింది. కేవలం 14 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ మూవీ 450 కోట్ల వసూళ్లను రాబట్టింది. కాంతార మూవీకి గాను బెస్ట్ యాక్టర్‌గా రిషబ్ శెట్టి నేషనల్ అవార్డును సొంతం చేసుకున్నాడు. కేజీఎఫ్ తర్వాత కన్నడలో హయ్యెస్ట్ కలెక్షన్స్ రాబట్టిన మూవీగా చరిత్రను తిరగరాసింది. కన్నడతో పాటు తెలుగు, హిందీ, తమిళ భాషల్లో బాక్సాఫీస్ వద్ద దుమ్మురేపింది.
రిలీజ్ డేట్ ఫిక్స్…
రికార్డులు తిరగరాసిన కాంతార మూవీకి ప్రీక్వెల్ వస్తోంది. కాంతార ఛాప్టర్ వన్ పేరుతో ఈ ప్రీక్వెల్ తెరకెక్కుతోంది. హీరో రిషబ్ శెట్టి బర్త్‌డే సందర్భంగా ఈ మూవీ రిలీజ్ డేట్‌తో పాటు ఫస్ట్ లుక్ పోస్టర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు.
యోధుడిగా…
ఈ పోస్టర్‌లో అగ్నిగుండం నుండి పైకి దూకుతున్న ఓ యోధుడిగా రిషబ్ శెట్టి కనిపిస్తోన్నారు. ఓ చేతిలో రక్తం మరకలతో నిండి ఉండ గొడ్డలి, మరో చేతిలో బాణాలు గుచ్చుకొని ఉన్న డాలు కనిపిస్తోన్నాయి. రిషబ్ శెట్టి పోస్టర్ అభిమానులను ఆకట్టుకుంటోంది.
షూటింగ్ కంప్లీట్…
కాంతర ఛాప్టర్ 1 షూటింగ్ పూర్తయినట్లు మేకర్స్ వెల్లడించారు. 2025 అక్టోబర్ 2న ఈ మూవీని రిలీజ్ చేయబోతున్నట్లు ప్రకటించారు. కన్నడతో పాటు తెలుగు, తమిళం, మలయాళం, హిందీ, బెంగాళీ భాషల్లో ఈ మూవీ రిలీజ్ కాబోతుంది.
3500 మందితో…
కాంతార బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్‌తో ప్రీక్వెల్ విషయంలో మేకర్స్ ఏ మాత్రం రాజీపడటం లేదు. ఇందులోని ఓ యుద్ధ సన్నివేశాన్ని 500 మంది ఫైటర్లు, 3000 మంది జూనియర్ ఆర్టిస్టులపై 25 ఏకరాల్లో టౌన్ సెట్ వేసి చిత్రీకరించినట్లు మేకర్స్ వెల్లడించారు. 45 నుంచి 50 రోజుల పాటు తెరకెక్కించిన ఈ ఫైట్ సీక్వెన్స్ సినిమాకు హైలైట్‌గా ఉంటుందని చెబుతోన్నారు. ఇండియన్ సినిమా హిస్టరీలోనే బిగ్గెస్ట్ యాక్షన్ సీక్వెన్స్‌గా ప్రేక్షకులను అలరిస్తుందని అంటున్నారు.


