Tuesday, January 21, 2025
Homeచిత్ర ప్రభBrahmamudi January 21th Episode: అపర్ణ దగ్గర కాళ్ల బేరానికి వచ్చిన కావ్య, రాజ్.. అనామిక...

Brahmamudi January 21th Episode: అపర్ణ దగ్గర కాళ్ల బేరానికి వచ్చిన కావ్య, రాజ్.. అనామిక పంపిన పేపర్స్‌లో ఏముంది..

ఈరోజు ఎపిసోడ్‌లో కావ్య ఇచ్చిన కాఫీని అపర్ణ తీసుకోలేదని కావ్య అలిగితే రాజ్ వచ్చి మా అమ్మకి కాఫీ నేను ఇస్తాను పౌరుషంగా వెళ్తాడు. కావ్య, ఇందిరా దేవి రెచ్చగొడితే రాజ్ పాటలు పాడుకుంటూ లోపలికి వెళ్లి కాలి చేతులతో వస్తాడు. బయటికి వచ్చిన రాజ్‌ని కావ్య, ఇందిరాదేవి కలిసి ఏంటి కాఫీ కప్ పగులినట్టు, చెంప పగిలినట్టు వినిపించింది అని ఇంకా ఉడికిస్తారు. మళ్లీ ఇంకోసారి నా ప్లాన్‌తో వెళ్లు కావ్య నేను చెప్పినట్టు చేయి అప్పుడు మా అమ్మ కరిగిపోతుంది అని చెప్తాడు. కావ్య ఏమో నేను ఒక్కరిద్దానే కాదు మీరు కుడా రండి అని కావ్య అంటుంది. అలా ఇద్దరి తప్పులూ ఎత్తి చూపుకుని ఇద్దరి కలిసి కాఫీ తీసుకువెళ్తారు.

- Advertisement -

అలా వెళ్లి అపర్ణ కాళ్ల మీద పడి ఏవోవో డైలాగ్‌లు చెప్పి ఒప్పించడానికి ట్రై చేసినా అపర్ణ వినకుండా అక్కడి నుంచి వెళ్లిపోతుంది. ఇందిరాదేవి వచ్చి ఆ కాఫీని తాగి మీ అమ్మ మనసు మార్చడం ఎవరి తరం కాదు అని చెప్పి కాఫీ తాగేస్తుంది. మరోవైపు కళ్యాణ్, అప్పు మాత్రం రోడ్‌ మాద నడుస్తూ మాట్లాడుకుంటుంటే దారిలో ఎవడో దొంగ వాడు ఒకరి పర్స్ దొంగతనం చేస్తుంటే అప్పు సేవ్ చేస్తుంది. తీరా చూస్తే అక్కడ సామంత్, అనామిక ఉంటారు. అనామిక గురించి తెలిసిందేగా మళ్లీ గొడవ మొదలుపెడుతుంది. కళ్యాణ్ ఊరుకోకుండా అప్పు పోలీస్ ట్రైనింగ్ అవుతున్న విషయం చెప్పి జాగ్రత్తగా ఉండు నీ తుప్పు వదిలిస్తుంది అని వెళ్లిపోతారు. ఆ మాటలకు అనామిక కుళ్లి పోయి వీళ్ల సంగతి మర్చిపోయా వెంటనే ఏదొక ప్లాన్ వేయాలి అనుకుంటుంది.

అక్కడ రుద్రాణి అనామిక పంపించిన పేపర్స్ తీసుకొని ధాన్యలక్ష్మి దగ్గరకు వస్తుంది. ధాన్యలక్ష్మి ఈ పేపర్స్ చూసి వాళ్ల అవుటౌ హౌస్‌ని రూ.25 కోట్ల తాకట్టు పెట్టారనే విషయం తెలిసుకుని ఓ ఆవేశపడుతుంది. ఇలా అప్పులు చేసి జల్సాలు చేస్తున్నారు అని ధాన్యలక్ష్మి అంటే నా ఆస్తి నేను ముక్కు పిండి వసూలు చేసుకుంటాను అంటుంది. అన్ని లెక్కలు తేలుస్తానని అంటుంది. అక్కడ కావ్య, రాజ్‌లు మాత్రం సరదాగా మాట్లాడుకుంటూ ఉంటారు ఇంతటితో ఎపిసోడ్ పూర్తవుతుంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News