Thursday, April 3, 2025
Homeచిత్ర ప్రభKeerthi Bhatt : నా బాయ్‌ఫ్రెండ్ నా మీద అనుమానంతో బ్రేకప్ చెప్పాడు..

Keerthi Bhatt : నా బాయ్‌ఫ్రెండ్ నా మీద అనుమానంతో బ్రేకప్ చెప్పాడు..

- Advertisement -

Keerthi Bhatt : బిగ్ బాస్ తెలుగులో ఆరో సీజన్ ఇటీవలే పూర్తయింది. ఈ సీజన్ విన్నర్ గా రేవంత్ నిలిచాడు. ఇక ఈ సీజన్ లో టాప్ 5లో నిలిచిన ఒకే ఒక అమ్మాయి కీర్తి భట్. షో మొదలైనప్పుడు కీర్తి తొందరగానే వెళ్ళిపోతుందని అంతా భావించారు. కానీ అందరి అంచనాలని తలకిందులు చేస్తూ టాప్ 3గా నిలిచి అందర్నీ ఆశ్చర్యపరిచింది.

పలు సీరియల్స్ లో నటిస్తున్న కీర్తి అనాధ అని, తనకి ఎవరూ లేరని, పేరెంట్స్ చనిపోయారని బిగ్ బాస్ లో చెప్తూ బాగా ఎమోషనల్ అయింది. తనకెవరూ లేరని ఎప్పుడూ బాధపడేది కీర్తి. బిగ్ బాస్ అనంతరం ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో కీర్తి మరోసారి తన గతాన్ని గుర్తుచేసుకొని ఏడ్చింది. అయితే ఈ సారి తన లవ్ గురించి తెలిపింది.

కీర్తి భట్ మాట్లాడుతూ.. ఒక అబ్బాయిని నేను చాలా ఎక్కువగా ప్రేమించాను. అతను కూడా నన్ను ప్రేమించాడు అనుకున్నాను. కానీ నాకు బ్యాక్ గ్రౌండ్ లేదు, నేను అనాధని. అవకాశాల కోసం ఈ అమ్మాయి ఏం చేసిందో, ఎలా ఇక్కడి దాకా అవచ్చిందో అని నన్ను చాలా మంది అనేవాళ్ళు. నా బాయ్ ఫ్రెండ్ కూడా అదే అని నన్ను అనుమానించి బ్రేకప్ చెప్పాడు. నేను అనాధ కంటే కూడా తను అనుమానించినందుకు, అర్ధం చేసుకొనేందుకు ఇంకా బాధ కలిగింది. ఇలాంటి వ్యక్తినా నేను ప్రేమించింది అని బాధపడ్డాను. తప్పుడు వ్యక్తిని ప్రేమించాను అని అర్ధం చేసుకొని అతని గురించి మర్చిపోయాను అని చెప్తూ ఎమోషనల్ అయింది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News