యువ హీరో కిరణ్ అబ్బవరం(Kiran Abbavaram) హీరోగా నటించిన ‘క'(KA Movie) మూవీ దీపావళి పండుగ కానుకగా విడుదలై సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. రూ.50 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. దీంతో కిరణ్ తర్వాతి సినిమాలపై ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. తాజాగా తన తదుపరి ప్రాజెక్టును ప్రారంభించాడు. ఇక ఈ సినిమాకి విశ్వ కరుణ్ దర్శకత్వం వహిస్తుండగా.. రవి, జోజో, జోస్, రాకేష్ రెడ్డి నిర్మిస్తున్నారు.
తాజాగా ఈ సినిమా విడుదల తేదీతో పాటు ఫస్ట్ లుక్‌ను విడుదల చేసింది చిత్రబృందం. ఈ చిత్రానికి ‘దిల్ రుబా’ (Dilruba) అనే పేరు పెట్టారు. అతడి కోపం.. అతడి ప్రేమ.. ప్రేమ చాలా గొప్పది కానీ అది ఇచ్చే బాధే భయంకరంగా ఉంటుంది అని తెలిపారు. ఈ పోస్టర్‌లో కిరణ్ మాస్ లుక్‌లో కనిపిస్తున్నాడు. ఈ సినిమాను ఫిబ్రవరిలో విడుదల చేయనున్నట్లు ప్రకటించారు.