K-RAMP Glimpse: యంగ్ హీరో కిరణ్ అబ్బవరం తన తదుపరి చిత్రం ‘K-ర్యాంప్’ తో ప్రేక్షకులను ఉర్రూతలూగించడానికి సిద్ధమవుతున్నాడు. ‘క’ సినిమాతో సూపర్ హిట్ సాధించి అందరి దృష్టిని ఆకర్షించిన కిరణ్ అబ్బవరం, ‘దిల్ రుబా’ చిత్రంతో కొంత నిరాశను చవిచూశారు. ఇప్పుడు మళ్లీ భారీ హిట్‌ను తన ఖాతాలో వేసుకోవాలని ‘K-ర్యాంప్’ సినిమాను రెడీ చేస్తున్నాడు. ఇప్పటికే విడుదలైన సినిమా ఫస్ట్ లుక్, టైటిల్ యూత్‌కి బాగా కనెక్ట్ అయ్యింది. జూలై 14న కిరణ్ అబ్బవరం పుట్టినరోజు.. ఈ సందర్భంగా మేకర్స్ ఈ మూవీ నుంచి గ్లింప్స్‌ను విడుదల చేశారు. ‘రిచెస్ట్ చిల్లర్ గయ్’ పేరుతో విడుదలైన ఈ గ్లింప్స్ విషయానికి వస్తే యూత్‌కు కనెక్ట్ అవుతుంది.. కానీ గ్లింప్స్‌లో ఇన్ని బూతులుంటే ఇక సినిమాలో ఎన్ని బూతులుంటాయోనని అనుకునేలా ఉంది. యూత్‌ని టార్గెట్ చేస్తూ డబుల్ మీనింగ్ డైలాగులతో నిండిపోయింది.
గ్లింప్స్‌ను గమనిస్తే..‘‘ఎల్లవరుక్కుమ్ నమస్కారం.. ఈసారి ఒక్కొక్కరికి బుర్ర పాడు.. బు*లు జారుడే’’ అంటూ కిరణ్ అబ్బవరం చెప్పే డైలాగ్ ఆకట్టుకుంది. ఇందులో కిరణ్, మాస్ ఆటిట్యూడ్ ఉన్న ‘రిచెస్ట్ చిల్లర్ గయ్’ కుమార్ పాత్రలో కనిపించనున్నాడు. చిల్ అవ్వడంలో అతనికి పోటీ లేదన్నట్లుగా, ఎప్పుడూ బార్లలో, పబ్బులలో తాగుతూ కనిపించాడు. ‘లైఫ్ ఎలా ఉంది కుమార్’ అని అడిగితే, ‘నా మొ.. లా ఉందంటూ’ అతను చెప్పే తీరును బట్టి సినిమాలో హీరో క్యారెక్టర్ ఎలా ఉంటుందో అర్థమవుతోంది.
Also Read – Green Tea Face Mask: స్కిన్ గ్లో ని పది రెట్లు పెంచే గ్రీన్ టీ మాస్క్..
మనోడు తన గ్యాంగ్‌తో కలిసి తాగుతూ చిల్ అవ్వడం, కాలేజీలో అల్లరి, బార్లలో తాగి ఫైట్ చేయడం వంటి సన్నివేశాలతో కట్ చేసిన ఈ గ్లింప్స్ యూత్ ఆడియన్స్‌ను లక్ష్యంగా చేసుకుని సాగింది. చివరలో ‘మనం ఏఎంబీ సినిమాలో మలయాళ ప్రేమకథలు చూసి హిట్ చేస్తాం, కానీ తెలుగు ప్రేమ కథలతోనే మనకు ప్రాబ్లం. ఎందుకంటే వాళ్లదంట్లో ఉన్న ఆత్.. సెంటిటీ మన దాంట్లో ఉండదు. మన ఇద్దరి ప్రేమ గు*సిపోయినా పర్లా.. ప్రేమ మాత్రం బాగుండాలి’ అంటూ కిరణ్ అబ్బవరం చెప్పిన పెద్ద డైలాగ్ హైలైట్‌గా నిలిచింది. ఈ గ్లింప్స్‌లో మలయాళ డైలాగులు, మలయాళ ప్రేమకథలను ప్రస్తావించడం చూస్తుంటే, సినిమాలో హీరో ఒక మల్లూ బ్యూటీని ప్రేమించాడేమో అనిపిస్తోంది.
‘రిచెస్ట్ చిల్లర్ గయ్’ పరిచయం బాగానే ఉన్నప్పటికీ, నెటిజన్లు మాత్రం మరీ చిల్లరి వేషాలు, బూతు డైలాగులు ఎక్కువగా ఉన్నాయని కామెంట్లు చేస్తున్నారు. ఇదెక్కడి లెక్క.. హీరో బూతులు మాట్లాడితే సినిమా హిట్ అవుతుందాఝ అని అంటున్నారు. ట్యూబ్‌లో సెన్సార్ ఉండదనే ధైర్యంతో సోషల్ మీడియాలో వైరల్ అయ్యే కంటెంట్‌తో వచ్చారని కొందరు అభిప్రాయపడుతున్నారు. మరి ఇది సినిమాకు ఏ మేరకు కలిసొస్తుందో వేచి చూడాలి. ఈ సినిమా దీపావళి పండుగ సందర్భంగా అక్టోబర్ 18న ప్రేక్షకుల ముందుకు రానుంది.
Also Read – Ayesha Khan : బ్లాక్ డ్రెస్‌లో మతి పోగొడుతున్న అయేషా ఖాన్