Sunday, November 16, 2025
Homeచిత్ర ప్రభDhanush Mrunal Dating: ధనుష్ తో మృణాల్ ప్రేమాయణం.. ఇదెక్కడి విడ్డూరమబ్బా..!

Dhanush Mrunal Dating: ధనుష్ తో మృణాల్ ప్రేమాయణం.. ఇదెక్కడి విడ్డూరమబ్బా..!

Dhanush Mrunal Dating: సినిమా రంగం అనేది ఒక రంగుల ప్రపంచం. ఇక్కడ విజయాలు, ప్రశంసలు ఉన్నట్లే, విమర్శలు, కష్టాలు కూడా ఉంటాయి. ముఖ్యంగా సెలబ్రిటీల జీవితాలు నిరంతరం ప్రజల దృష్టిలో ఉంటాయి. సోషల్ మీడియా రాకతో, నటీనటులు ఎక్కడికి వెళ్లాలన్నా, ఏది మాట్లాడాలన్నా చాలా జాగ్రత్తగా ఉండాల్సి వస్తోంది. ఎక్కడ చిన్న పొరపాటు జరిగినా ట్రోలర్లు ఏకిపారేస్తున్నారు. అలాంటి ట్రోల‌ర్స్‌కి, మీడియాకు ఆస‌క్తిక‌ర‌మైన వార్తొక‌టి దొరికింది. వివ‌రాల్లోకెళ్తే.. కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ మరోసారి ప్రేమలో పడినట్లుగా వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి. ఐశ్వర్య రజినీకాంత్ తో విడాకులు తీసుకున్నప్పటి నుండి ధనుష్ ఒంటరిగా ఉంటున్నారు. గతంలోనూ ధనుష్ చాలా మంది హీరోయిన్లతో సంబంధాలు పెట్టుకున్నాడని, ఆ విషయం తెలియడంతోనే ఐశ్వర్య విడాకులు ఇచ్చిందని పుకార్లు వచ్చాయి. అయితే ఆ సంఘటనల తర్వాత కూడా ధనుష్ లో మార్పు రాలేదని తెలుస్తోంది. ఇటీవల, ధనుష్ సీనియర్ హీరోయిన్ మీనాతో పెళ్లి చేసుకోబోతున్నాడని వార్తలు పుట్టుకొచ్చాయి, కానీ అవన్నీ నిజాలు కావ‌ని తేలిపోయాయి.

- Advertisement -

ఇప్పుడు కొత్తగా ధనుష్, స్టార్ హీరోయిన్ మృణాల్ ఠాకూర్ మధ్య ల‌వ్ ట్రాక్‌ నడుస్తోందని పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఈ వార్తలకు కారణం లేకపోలేదు. ఈ మధ్యకాలంలో ధనుష్, మృణాల్ తరచుగా జంటగా కనిపిస్తున్నారు. ముఖ్యంగా మృణాల్ పుట్టినరోజు వేడుకల్లో ధనుష్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఆ వేడుక మొత్తం ఆమె పక్కనే ఉంటూ, మృణాల్ తో ఎంతో సన్నిహితంగా కనిపించారు. వారిద్దరిని చూసిన వారందరూ వీరి మధ్య కొత్త బంధం ఉందని గుసగుసలాడుకోవడం మొదలుపెట్టారు. మృణాల్ బర్త్ డే వేడుకల్లోనే కాదు, ఈ చిన్నది ఎక్కడ ఉంటే ధనుష్ అక్కడ ఉంటున్నాడని, ‘సార్ ఎక్కడ ఉంటే సీత కూడా అక్కడే కనిపిస్తుంది’ అన్నట్లుగా పరిస్థితులు ఉన్నాయని వార్తలు వస్తున్నాయి. అంతేకాకుండా, ఇటీవల మృణాల్ కు అసలు సంబంధం లేని ఒక పార్టీ ఈవెంట్ లో కూడా ఆమె సందడి చేసింది, అందుకు కారణం ధనుష్ అనే బలమైన వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో బాలీవుడ్ లో ఈ జంటే కొత్త ప్రేమ జంట అని పుకార్లు షికార్లు చేయడం మొదలుపెట్టాయి.

Also Read – Ban on Love Marriages:పంజాబ్‌లో ప్రేమ వివాహాలపై నిషేధం.. గ్రామ పంచాయతీ తీర్మానంపై తీవ్ర వివాదం..!

ఈ వార్తల్లో నిజమెంత అనేది ఇంకా స్పష్టంగా తెలియదు. అయితే, ఒకవేళ ఈ విషయం నిజమైతే మాత్రం మృణాల్ కెరీర్ కు తీవ్రంగా దెబ్బ తగిలే అవకాశం ఉందని వార్తలు వినిపిస్తున్నాయి. ఎందుకంటే మృణాల్ తన కెరీర్ ను ఒక్కో మెట్టు ఎక్కుతూ చాలా కష్టపడి నిర్మించుకుంది. అటువంటి ఆమె భార్యకు విడాకులు ఇచ్చిన స్టార్ హీరో ప్రేమలో పడుతుందా? అంటే నమ్మశక్యం కాని విషయమని కొందరు అభిప్రాయపడుతున్నారు. నెటిజన్లు కూడా వీరి ప్రేమాయణం గురించి విని ఇదెక్కడి విడ్డూరం అబ్బా అని కామెంట్స్ చేస్తున్నారు.

ప్రస్తుతం మృణాల్ కెరీర్ విషయానికొస్తే, ఆమె తెలుగులో ‘డెకాయిట్’ సినిమాలో నటిస్తోంది. ధనుష్ కూడా తెలుగు, తమిళం, హిందీ భాషల్లో వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ఈ పుకార్లలో నిజం ఎంత అనేది కాలమే నిర్ణయించాలి.

Also Read – Anupama Parameswaran: ఓటీటీలోకి అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ మ‌ల‌యాళం లీగ‌ల్ థ్రిల్ల‌ర్‌ మూవీ – తెలుగులోనూ స్ట్రీమింగ్‌

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad