Saturday, November 15, 2025
Homeచిత్ర ప్రభKotha Lokah OTT Release: ఓటీటీకి ‘కొత్త లోక’.. దుల్కర్‌ పోస్ట్‌తో క్లారిటీ

Kotha Lokah OTT Release: ఓటీటీకి ‘కొత్త లోక’.. దుల్కర్‌ పోస్ట్‌తో క్లారిటీ

Dulquer Salmaan On Kotha Lokah OTT Release: మలయాళ బ్యూటీ కల్యాణి ప్రియదర్శన్ ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ సూపర్ హీరో ఫాంటసీ థ్రిల్లర్ ‘కొత్త లోక’ ఓటీటీ రిలీజ్ రూమర్స్‌పై నిర్మాత దుల్కర్‌ సల్మాన్‌ స్పందించారు. డొమినిక్ అరుణ్ దర్శకత్వం వహించిన ఈ మూవీ ఆగస్ట్ 28న ప్రేక్షకుల ముందుకు వచ్చి సంచలన విజయం సాధించింది. ఫస్ట్ చిన్న మూవీగానే వచ్చినా ఆ తర్వాత కేవలం మౌత్ టాక్‌తోనే రూ. 200 కోట్ల సినిమాగా రికార్డు సృష్టించింది. 

- Advertisement -

‘కొత్త లోక’ మూవీ ఓ ప్రముఖ ఓటీటీలో ఈ నెలాఖరు నుంచి స్ట్రీమింగ్ అవుతుందంటూ ప్రచారం జరిగిన విషయం తెలిసిందే. వీటిపై స్పందించిన దుల్కర్ అది నిజం కాదని స్పష్టం చేశారు. ఇప్పటికీ థియేటర్లలో మూవీ సక్సెస్ ఫుల్‌గా రన్ అవుతుందని చెప్పారు. ఈ క్రమంలో సోషల్ మీడియా వేదికగా జరుగుతున్న ప్రచారాన్ని ఖండించారు. ”కొత్త లోక’ మూవీ ఏ ఓటీటీలోకి కూడా రావడం లేదు. తప్పుడు ప్రచారాలు, రూమర్లను నమ్మకండి. అఫీషియల్ అనౌన్స్‌మెంట్స్ కోసం వెయిట్ చేయండి.’ అంటూ దుల్కర్‌ ‘X’లో పోస్ట్‌ చేశారు. 

Also Read: https://teluguprabha.net/cinema-news/og-ticket-auction-record-price-rs-1-29-lakhs-in-telangana/

‘హలో’, ‘చిత్రలహరి’ వంటి మూవీస్‌తో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన కల్యాణి ప్రియదర్శన్.. ఓ డిఫరెంట్ కాన్సెప్ట్ ‘కొత్త లోక’తో మరోసారి ప్రతిభ కనబరిచింది. ప్రేమలు ఫేం నస్లెన్ నటించగా… దుల్కర్ సల్మాన్, టొవినో థామస్, షాబిన్ షౌహిర్ అతిథి పాత్రల్లో తళుక్కుమన్నారు. డొమినిక్ అరుణ్ దర్శకత్వం వహించిన ఈ మూవీని తన నిర్మాణ సంస్థ ‘వేఫేరర్ ఫిల్మ్స్’ బ్యానర్‌పై దుల్కర్ సల్మాన్ నిర్మించాడు. తెలుగులో సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై నాగవంశీ రిలీజ్ చేయగా.. కేవలం మౌత్ టాక్‌తోనే బిగ్గెస్ట్ హిట్‌గా ‘కొత్త లోక’ నిలిచింది. 

Also Read:https://teluguprabha.net/cinema-news/dadasaheb-phalke-award-recipients-from-telugu-cinema-industry-till-now/

రూ. 30 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ మూవీ ఇప్పటివరకూ దాదాపు రూ. 270 కోట్ల గ్రాస్ వసూలు చేసనట్లు ట్రేడ్ వర్గాలు పేర్కొన్నాయి. అంతేకాదు అత్యధిక వసూళ్లు సాధించిన మలయాళ మూవీగా రికార్డు సృష్టించింది. ఇప్పటివరకూ ఆ ప్లేస్‌ను మలయాళ స్టార్ మోహన్ లాల్ ‘ఎల్ 2: ఎంపురాన్’ కైవసం చేసుకోగా ఆ స్థానంలో ‘కొత్త లోక’ నిలిచింది. మలయాళంతో పాటు ఇతర భాషల్లోనూ హిట్‌ టాక్‌ను అందుకుంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad