Ram Charan: రంగస్థలం బ్లాక్‌బస్టర్ తర్వాత రామ్‌చరణ్, డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్‌లో మరో మూవీ రాబోతుంది. ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా సాగుతోన్నాయి. ప్రస్తుతం పెద్ది సినిమాతో రామ్‌చరణ్ బిజీగా ఉన్నాడు. బుచ్చిబాబు సానా దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ స్పోర్ట్స్ డ్రామా మూవీ పూర్తయిన వెంటనే సుకుమార్ సినిమా సెట్స్‌పైకి రానుంది. వచ్చే ఏడాది వేసవి నుంచి రామ్‌చరణ్, సుకుమార్ మూవీ రెగ్యులర్ షూటింగ్ మొదలు కాబోతున్నట్లు సమాచారం.
బాలీవుడ్ బ్యూటీ…
రామ్‌చరణ్ హీరోగా నటిస్తున్న 17వ సినిమాకు సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఆర్‌సీ 17లో బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్ హీరోయిన్‌గా నటించబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. రామ్‌చరణ్ సినిమా కోసం కృతిసనన్‌ను సుకుమార్ టీమ్ సంప్రదించినట్లు తెలిసింది. సుకుమార్‌పై నమ్మకంతో కథ కూడా పూర్తిగా వినకుండానే కృతి సనన్ ఈ మూవీకి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చిందని అంటున్నారు. బల్క్ డేట్స్ ఇవ్వడానికి అంగీకరించినట్లు చెబుతోన్నారు.
Also Read- Nayanthara: నయనతార మారిపోయిందిగా – ఆ రూల్ పక్కన పెట్టినట్లేనా?
వన్ నేనొక్కడినే మూవీతో…
హీరోయిన్‌గా కృతిసనన్‌కు ఫస్ట్ ఛాన్స్ సుకుమార్ ఇచ్చారు. మహేష్‌బాబు హీరోగా నటించిన వన్ నేనొక్కడినే సినిమాతోనే కృతి సనన్ యాక్టింగ్ జర్నీ మొదలైంది. మళ్లీ సుకుమార్ మూవీతోనే టాలీవుడ్‌లోకి రీఎంట్రీ ఇవ్వబోతున్నది. వన్ నేనొక్కడినే తర్వాత తెలుగులో దోచేయ్, ఆదిపురుష్ సినిమాలు చేసింది. ఈ రెండు ఆమెకు నిరాశనే మిగిల్చాయి. టాలీవుడ్ కలిసి రాకపోయినా బాలీవుడ్‌లో మాత్రం వరుస విజయాలతో టాప్ హీరోయిన్లలో ఒకరిగా పేరు తెచ్చుకున్నది. ఇటీవల రిలీజైన దో పత్తి మూవీతో ప్రొడ్యూసర్‌గా మారింది.
300 కోట్ల బడ్జెట్…
మరోవైపు పెద్ది మూవీతో వచ్చే ఏడాది మార్చి 27న ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు రామ్‌చరణ్. బుచ్చిబాబు సానా దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో జాన్వీకపూర్ హీరోయిన్‌గా నటిస్తోంది. క్రికెట్ బ్యాక్‌డ్రాప్‌లో రూరల్ యాక్షన్ థ్రిల్లర్‌గా ఈ సినిమా తెరకెక్కుతోన్నట్లు సమాచారం. కన్నడ అగ్ర హీరో శివరాజ్‌కుమార్‌తో పాటు బాలీవుడ్ నటుడు దివ్యేందు శర్మ ఈ సినిమాలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. దాదాపు మూడు వందల కోట్ల బడ్జెట్‌తో మైత్రీ మూవీ మేకర్స్‌తో కలిసి వెంకట సతీష్ కిలారు పెద్ది సినిమాను నిర్మిస్తున్నారు.
Also Read- Maryada Manish: ఏం గేమ్ సార్ మీది.. భరిణిపై మనీష్ ప్రశంసలు.. ప్రియాశెట్టిపై బిగ్ బాంబ్


