Krithi Shetty: దక్షిణాది హీరోయిన్లకు బాలీవుడ్‌లో ఫుల్ డిమాండ్ ఉంది. రష్మిక మందన్న హిందీ చిత్రసీమలో దూసుకుపోతుంది. యానిమల్, ఛావా సినిమాలతో బ్లాక్‌బస్టర్స్ దక్కించుకున్నది. శ్రీలీల ఆషికి 3తో హిందీలో తొలి అడుగు వేయబోతుంది. నయనతార, సమంతతో పాటు పలువురు దక్షిణాది నాయికలు బాలీవుడ్‌లో అదరగొట్టారు. వీరి బాటలోకి ఉప్పెన హీరోయిన్ కృతిశెట్టి అడుగులు వేయబోతుంది. బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తోంది.
సీనియర్ హీరో గోవిందా తనయుడు యశ్వర్ధన్ ఆహుజా కథానాయకుడిగా అరంగేట్రం చేయబోతున్నాడు. సాజిద్ ఖాన్ దర్శకత్వం వహించనున్న ఈ బాలీవుడ్ మూవీని జీ స్టూడియోస్ సంస్థ నిర్మిస్తోంది. ఈ సినిమాలో యశ్వర్ధన్‌కు జోడీగా కృతి శెట్టి హీరోయిన్‌గా నటించనున్నట్లు ప్రచారం జరుగుతోంది.
ఇటీవలే యశ్వర్ధన్, కృతిశెట్టిపై మేకర్స్ లుక్ టెస్ట్ చేసినట్లు సమాచారం. సైయారా తరహాలో న్యూఏజ్ లవ్‌స్టోరీగా ఈ బాలీవుడ్ మూవీ ఉండబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ సినిమాలో కృతి శెట్టితో పాటు నితాన్షి గోయల్ మరో హీరోయిన్‌గా కనిపించబోతున్నదట. దక్షిణాదిలో సూపర్ హిట్టైన ఓ మూవీకి రీమేక్‌గా గోవిందా తనయుడి మూవీ తెరకెక్కనున్నట్లు చెబుతున్నారు. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రానుంది.
Also Read – Mount Everest: ఎవరెస్ట్‌పై తుపాను బీభత్సం.. చిక్కుకుపోయిన 1000 మంది పర్వతారోహకులు!
ఉప్పెనతో ఎంట్రీ…
బుచ్చిబాబు సానా దర్శకత్వంలో రూపొందిన ఉప్పెన మూవీతో హీరోయిన్‌గా కృతిశెట్టి కెరీర్ మొదలైంది. డిఫరెంట్ లవ్‌స్టోరీగా తెరకెక్కిన ఈ మూవీ వంద కోట్లకుపైగా వసూళ్లను దక్కించుకున్నది. ఈ మూవీలో బేబమ్మ పాత్రలో నాచురల్ యాక్టింగ్‌తో తెలుగు ప్రేక్షకులను మెప్పించింది కృతిశెట్టి. ఉప్పెన హిట్‌తో కృతిశెట్టి తెలుగులో బిజీగా మారింది. శ్యామ్‌సింగరాయ్, బంగార్రాజుతో హ్యాట్రిక్ విజయాలను దక్కించుకున్నది. కథల ఎంపికలో చేసిన పొరపాట్ల కారణంగా ఆ తర్వాత చేసిన సినిమాలేవి కృతిశెట్టికి విజయాలను అందించలేకపోయాయి. మాచర్ల నియోజకవర్గం, ది వారియర్, కస్టడీతో పాటు ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి సినిమాలు డిజాస్టర్స్ అయ్యాయి.
తమిళంలో మూడు సినిమాలు…
టాలీవుడ్‌లో అవకాశాలు తగ్గిపోవడంతో కోలీవుడ్‌కు తమిళం, మలయాళ భాషలపై ఫోకస్ పెట్టింది. తమిళంలో ప్రస్తుతం మూడు సినిమాలు చేస్తోంది కృతి శెట్టి. కార్తి వా వతియార్, ప్రదీప్ రంగనాథన్ లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ సినిమాల్లో హీరోయిన్‌గా నటిస్తోంది. జయం రవితో జీనీ సినిమా చేస్తోంది.
Also Read – Tollywood: టాలీవుడ్‌లో కొత్త సమస్య – థియేటర్లు బంద్‌కు ఎగ్జిబిటర్ల సన్నాహాలు – కారణం ఇదే!


