Thursday, April 3, 2025
Homeచిత్ర ప్రభKrithi Shetty : రౌడీ హీరో పక్కన బేబమ్మ??

Krithi Shetty : రౌడీ హీరో పక్కన బేబమ్మ??

- Advertisement -

Krithi Shetty : విజయ్ దేవరకొండ, సమంత జంటగా శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ఖుషి. మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఖుషి సినిమా రెండు షెడ్యూల్స్ షూటింగ్ పూర్తి చేసుకుంది. అయితే సమంత ఆరోగ్యం బాగోకపోవడంతో ఈ సినిమా షూట్ ప్రస్తుతానికి ఆగింది.

అటు విజయ్ దేవరకొండకి కూడా ఖుషి తప్ప చేతిలో సినిమాలేమి లేవు. దీంతో విజయ్ కూడా ఖాళీగానే ఉన్నాడు. అయితే ఖుషి సినిమాలో సెకండ్ హాఫ్ లో ఇంకో హీరోయిన్ కి ఛాన్స్ ఉందట. సమంత వచ్చేలోపు ఆ హీరోయిన్ ని ఫైనల్ చేసి ఆ సన్నివేశాలని తెరకెక్కించాలని చిత్ర యూనిట్ భావించారు.

దీంతో సెకండ్ హీరోయిన్ గా కృతిశెట్టిని తీసుకున్నట్టు సమాచారం. శివ నిర్వాణ కృతికి కథ చెప్పి ఒప్పించాడని, కృతి కూడా ప్రాజెక్టు కి ఓకే చెప్పిందని, త్వరలోనే విజయ్ దేవరకొండ సరసన బేబమ్మ నటించనుందని టాలీవుడ్ సమాచారం. అయితే దీనిపై చిత్ర యూనిట్ నుంచి మాత్రం అధికారిక ప్రకటన రాలేదు. విజయ్ పక్కన కృతి నటిస్తే ఎలా ఉంటుందో చూడాలని అభిమానులు కూడా కోరుకుంటున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News