Lenin Update: అఖిల్ అక్కినేని హీరోగా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చి పదేళ్లు అవుతోంది. ఇప్పటివరకు హిట్టు మాత్రం దక్కించుకోలేకపోయాడు. చివరగా 2023లో రిలీజైన ఏజెంట్‌తో తెలుగు ప్రేక్షకుల ముందుకొచ్చాడు అఖిల్. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో స్పై యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ మూవీ బిగ్గెస్ట్ డిజాస్టర్‌గా నిలిచింది. 80 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఏజెంట్ పది కోట్ల లోపే కలెక్షన్స్‌ను దక్కించుకున్నది. నిర్మాతలను నిండా ముంచేసింది. రాయలసీమ ఏజెంట్ డిజాస్టర్‌తో రెండేళ్ల పాటు సినిమాలకు బ్రేక్ తీసుకున్నాడు అఖిల్. ఈ సారి ఎలాగైనా హిట్టు కొట్టాలనే ఆలోచనతో కథల ఎంపికలో రూటు మార్చాడు. రాయలసీమ బ్యాక్‌డ్రాప్‌లో లెనిన్ సినిమా చేస్తున్నాడు. గ్రామీణ నేపథ్య ప్రేమకథగా డైరెక్టర్ మురళీకృష్ణ అబ్బూరు ఈ సినిమాను తెరకెక్కిస్తోన్నారు.
Also Read – DIWALI: ఒకే వీకెండ్‌లో నలుగురు కొత్త డైరెక్టర్ లు, దీపావళి బాక్సాఫీస్‌లో ‘డెబ్యూ’ ధమాకా!
జాతర సెట్టు…
లెనిన్ షూటింగ్ శరవేగంగా సాగుతోంది. ప్రస్తుతం హైదరాబాద్‌లో ఓ సాంగ్ షూట్ చేస్తున్నారు. జాతర సెటప్‌తో సాగే ఈ పాటకు దినేష్ మాస్టర్ కొరియోగ్రఫీ అందిస్తున్నాడు. ఈ పాట కోసం మాస్ బీట్స్‌తో మంచి క్యాచీ ట్యూన్‌ను మ్యూజిక్ డైరెక్టర్ తమన్ సిద్ధం చేసినట్లు చెబుతున్నారు. అఖిల్ స్టెప్పులు కూడా హైలైట్‌గా ఉంటాయట. లెనిన్ షూటింగ్ యాభై శాతానికిపైగా పూర్తయినట్లు టాక్. ఫిబ్రవరిలోగా షూటింగ్‌ను కంప్లీట్ చేసి సమ్మర్‌లో పక్కగా సినిమాను రిలీజ్ చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. లెనిన్‌లో అఖిల్‌కు జోడీగా భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా నటిస్తోంది. తొలుత శ్రీలీలను హీరోయిన్‌గా ఎంపికచేశారు మేకర్స్. ఫస్ట్‌లుక్ పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. కానీ డేట్స్ ఈష్యూ కారణంగా సెట్స్‌లో అడుగుపెట్టకుండానే శ్రీలీల ఈ సినిమా నుంచి తప్పుకుంది.
నాగార్జునతో కలిసి…
లెనిన్ సినిమాను అన్నపూర్ణ స్టూడియోస్, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకాలపై నాగార్జున, సూర్యదేవర నాగవంశీ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. డైరెక్టర్‌గా మురళీకృష్ణ అబ్బూరుకు లెనిన్ సెకండ్ మూవీ. గతంలో కిరణ్ అబ్బవరం హీరోగా వినరో భాగ్యము విష్ణుకథ అనే సినిమాను తెరకెక్కించాడు. కమర్షియల్‌గా ఈ మూవీ హిట్టు టాక్‌ను సొంతం చేసుకుంది. ఈ ఏడాది జూన్‌లో పెళ్లి పీటలు ఎక్కాడు అఖిల్. ప్రియురాలు జైనబ్ రవ్దీ మెడలో మూడుముళ్లు వేశాడు.
Also Read- Balakrishna: హిందూపురాన్ని నెం. 1గా తీర్చిదిద్దే బాధ్యత నాదే.. బాలకృష్ణ


