Friday, June 28, 2024
Homeచిత్ర ప్రభMadhu Mantena: సాయి పల్లవి సీత, రాముడిగా రణబీర్ కపూర్, రావణుడిగా హృతిక్

Madhu Mantena: సాయి పల్లవి సీత, రాముడిగా రణబీర్ కపూర్, రావణుడిగా హృతిక్

మధు మంతెన తన కొత్త సినిమా ‘రామాయణ్’ సినిమాపై అంతకంతకూ ఎక్స్ పెక్టేషన్స్ పెంచేస్తున్నారు. లేటెస్ట్ రూమర్స్ నిజమైతే సౌత్ స్టార్ హీరోయిన్ సాయి పల్లవి హిందీలోనూ తళుక్కుమని మెరవబోతున్నట్టే లెక్క. మధు తన సినిమా కోసం సాయి పల్లవిని అప్రోచ్ అయ్యారని టాక్. తమిళ్, తెలుగు ఇండస్ట్రీలో సాయి పల్లవికి ఉన్న క్రేజ్ మనందరికీ తెలిసిందే. స్టెల్లార్ పర్ఫార్మెన్స్ చేస్తూనే చాలా సింపుల్ అండ్ నాచురల్ గా కనిపించే సాయి పల్లవికి గ్రాండ్ బాలీవుడ్ ఎంట్రీ దొరకటం దాదాపు ఖాయంగా మారింది.

- Advertisement -

గతంలో దీపికా పదుకున్ తో సీత వేషం వేయించాలనుకున్న సినిమా టీం, ఇప్పుడు ఆ రోల్ కు సాయి పల్లవి బెస్ట్ అని భావిస్తున్నారు. దీపికకు ద్రౌపది పాత్రను అప్పగించేసినట్టు లేటెస్ట్ గా తెలుస్తోంది. కానీ ఓల్డ్ ఛార్మ్ ఉన్న మంచి ఏ లిస్ట్ యాక్ట్రెసెస్ కోసం ట్రై చేస్తున్న ‘రామాయణ్’ సినిమా టీంకు సాయి పల్లవి బెస్ట్ ఆప్షన్ గా అనిపిస్తోంది. ఈ సినిమాలో రాముడి పాత్రను ఇప్పటికే రణబీర్ కపూర్ కు ఇచ్చినట్టు, హృతిక్ రోషన్ రావణుడిగా ఈ సినిమాలో కనిపిస్తారని తెలుస్తోంది.

శ్యాం సింగరాయ్, గార్గి, విరాట పర్వం వంటి సినిమాలన్నీవరుస ఫ్లాపులు కావటంతో మంచి హిట్ సినిమా, క్రేజీ ప్రాజెక్ట్ కోసం సాయి పల్లవి వెయిట్ చేస్తున్నారు. ఆమె ఎస్ చెబితే రకరకాల సినిమాల ఆఫర్లు వచ్చి వాలటం ఖాయం. కానీ మనందరికీ తెలుసుగా ఆమె ఎంత సెలెక్టివ్ గా, చూజీగా సినిమాలు ఓకే చేస్తారో.

మధు మంతెన రామాయణం, మహాభారత్ అని రెండు భారీ బడ్జెట్ సినిమాలు తీసే ప్రయత్నంలో గత కొన్నేళ్లుగా ఉన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News