Allu Aravind Movies: ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాల (Pan India Cinemas) హవా నడుస్తోంది. భాషతో సంబంధం లేకుండా ప్రేక్షకులు అన్ని భాషల్లోని సినిమాలను చూడటానికి ఆసక్తి చూపుతున్నారు. ఇలాంటి సమయంలో, తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఒక ఆసక్తికరమైన అంశం డిస్కషన్‌లోకి వచ్చింది. ఇది ఓ రకంగా పవన్ కళ్యాణ్ అభిమానులను కలవరపెడుతోందని చెప్పాలి. వివరాల్లోకి వెళితే.. పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) నటించిన ప్రతిష్టాత్మక చిత్రం ‘హరిహర వీరమల్లు’ (Hari Hara Veera Mallu) జూలై 24న ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే. వాస్తవానికి, ఈ సినిమా ఎప్పుడో విడుదల కావాల్సి ఉంది, కానీ కొన్ని కారణాల వల్ల వాయిదా పడుతూ వచ్చింది. చివరకు జూలై 24న రిలీజ్ అవుతుంది. ఈ సినిమా ప్రీ-రిలీజ్ (HHVM Pre Release Event) ఈవెంట్ జూలై 21న సోమవారం హైదరాబాద్‌లోని శిల్పకళా వేదికలో జరగనుంది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్‌తో అంచనాలు భారీగా పెరిగాయి.
Also Read- Nabha Natesh: హాట్ హాట్ అందాలతో నిషా ఎక్కిస్తున్న నభా నటేష్, ఫోటోలు వైరల్
అయితే ఇక్కడ ప్రస్తావించాల్సిన విషయమేమంటే ‘హరిహర వీరమల్లు’కు గట్టి పోటీనిచ్చేలా ‘మహావతార్ నరసింహ’ (Mahavatar Narsimha) అనే యానిమేటెడ్ చిత్రం జూలై 25న విడుదల కానుంది. ఈ సినిమా ట్రైలర్ ఇదివరకే విడుదలైంది. హోంబలే ఫిల్మ్స్, క్లీమ్ ప్రొడక్షన్స్ కలిసి ఈ యానిమేటెడ్ చిత్రాన్ని నిర్మించాయి. అత్యాధునిక యానిమేషన్‌తో రూపొందించబడిన ఈ సినిమా పిల్లలను కూడా ఆకట్టుకునేలా డిజైన్ చేయబడింది. ‘మహా అవతార్ నరసింహ’ సినిమాను తెలుగు రాష్ట్రాల్లో గీత ఫిలిం డిస్ట్రిబ్యూషన్ (Geeta Films) సంస్థ విడుదల చేస్తుంది. గతంలో ఈ సంస్థ హోంబలే ఫిల్మ్స్ (Hobale Films) నిర్మించిన ‘కాంతార’ వంటి అనేక హిట్ సినిమాలను తెలుగు ప్రేక్షకులకు అందించింది. ఇప్పుడు ఇదే సంస్థ నుంచి వస్తున్న ఈ యానిమేటెడ్ సినిమా ‘హరిహర వీరమల్లు’పై కొంతమేరకైనా ప్రభావం చూపిస్తుందని అంటున్నారు.
పవన్ కళ్యాణ్ సినిమా విడుదలైన మరుసటి రోజే ఈ యానిమేటెడ్ సినిమాను థియేటర్లలోకి తీసుకురావడం సరైనది కాదని కొంతమంది మెగా అభిమానులు అభిప్రాయపడుతున్నారు. పొరపాటున ‘హరిహర వీరమల్లు’కు డివైడ్ టాక్ వచ్చినా ‘మహా అవతార్ నరసింహ’ అది కలిసొస్తుందని వారి ఆలోచన కావచ్చు. ఏదేమైనా, ఈ రెండు చిత్రాల మధ్య విడుదల తేదీల అంతరం తక్కువగా ఉండటం బాక్సాఫీస్ వద్ద ఆసక్తికరమైన పోరును సృష్టిస్తుందని చెప్పాలి. ఈ పోటీ ‘హరిహర వీరమల్లు’ సినిమా కలెక్షన్లపై కొంతమేర ప్రభావం చూపే అవకాశం ఉందని స్పష్టమవుతోంది. ఏమవుతుందో తెలియాలంటే మరో వారం రోజులు ఆగాల్సిందే.
Also Read- Junior Movie Review: ‘జూనియర్’ మూవీ రివ్యూ


