Malaika Arora: సినిమా ఇండస్ట్రీలో ఉండే స్టార్ హీరోయిన్స్ పెళ్లిళ్లు చేసుకోవడం బ్రేకప్ అనడం తిరిగి మళ్ళీ రెండవ పెళ్లికి రెడీ అనడం పెద్ద విషయమేమీ కాదు. ఇదివరకే చాలామంది సెలబ్రిటీలు ఇలా రెండు, మూడు పెళ్లిళ్లు చేసుకొని వార్తల్లో వైరల్ అయినవారే. ఇంకొంతమంది విడాకులు తీసుకొని రెండో పెళ్లికి సిద్ధమవుతున్న వారు ఇప్పుడు లైన్ ఉన్నారు. ఈ లిస్ట్ లో చేరింది బాలీవుడ్ హాట్ బ్యూటీ మలైకా ఆరోరా. హిందీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్‌గా, ఐటం భామగా ఓ వెలుగు వెలిగింది. మలైకా గతంలో పెళ్లి చేసుకొని తన భర్తకు విడాకులు ఇచ్చిన సంగతి అందరికీ తెలిసిందే. ఆయనెవరో కాదు సల్మాన్ సోదరుడు అర్బాజ్ ఖాన్.
ఇక ఆ మలైకా విడాకుల తర్వాత తనకంటే చాలా తక్కువ ఏజ్ ఉన్న హీరోతో షికార్లు చేసింది. ఇద్దరు కలిసి కొన్నేళ్ళుగా డేట్ చేశారు కూడా. ఆ హీరో ఎవరో కాదు.. బాలీవుడ్ నటుడు అర్జున్ కపూర్. మలైకా అరోరా, అర్బాక్ దంపతులు తమ వైవాహిక జీవితంలో కొంతకాలం బాగానే ఉన్నారు. ఈ జంటకి ఒక బాబు కూడా పుట్టాడు. ఇలా సంతోషంగా సాగిపోతున్న వీరి వైవాహిక జీవితంలో అనూహ్యంగా విబేదాలు రావడంతో 2017వ సంవత్సరంలో విడాకులు తీసుకున్నారు.
Also Read – Viral: ChatGPTని గుడ్డిగా నమ్మి.. హాస్పిటల్ పాలయ్యాడు!
విడాకుల తర్వాతే మలైకా.. అర్జున్ కపూర్ తో సన్నిహితంగా ఉంది. ఇద్దరూ ఎక్కడికి వెళ్లినా కలిసే వెళ్ళారు. ఎన్నోసార్లు మీడియా కంట పడ్డారు. ఇద్దరు పెళ్ళి చేసుకోబోతున్నారంటూ కూడా వార్తలు వచ్చాయి. కానీ, దాన్ని ఇద్దరిలో ఎవరూ కన్‌ఫర్మ్ చేయలేదు. ఇక తాజాగా మలైకా తన రెండో పెళ్లి గురించి చేసిన సంచలన వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. మలైకా, ఇలా 51 సంవత్సరాల వయసులో రెండో పెళ్లి కోసం సరైన వ్యక్తి గురించి ఎదురు చూస్తునానని చెప్పడం ఆసక్తికరం. నిజంగా అలా దొరికితే అతన్ని పెళ్ళి చేసుకుంటానని కన్‌ఫర్మ్ చేసింది.
అయితే, మలైకా రెండో పెళ్లి డేటింగ్ చేసిన బాయ్ ఫ్రెండ్ అర్జున్ కపూర్ తో ఉంటుందా.. లేక తన ఇష్టాలను గౌరవించే వ్యక్తి దొరికినప్పుడు పెళ్లి చేసుకుంటుందా.. అనేది మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. కానీ గ్యారెంటీగా రెండవ పెళ్లి చేసుకుంటానని చెప్పడం ఇప్పుడు అటు ముంబై మీడియాలో ఇటు సౌత్ మీడియాలో హాట్ టాపిక్ అవుతోంది. ఇక బాలీవుడ్ ఇండస్ట్రీలో నటిగా ఎంతో మంచి సక్సెస్ చూసింది మలైకా. మరీ ముఖ్యంగా స్పెషల్ సాంగ్స్ తో బాగా పాపులర్ అయింది. మలైకా తెలుగులోనూ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా గబ్బర్ సింగ్ సినిమాలో స్పెషల్ సాంగ్ కెవ్వు కేక చేసి తన డాన్స్ తో మెస్మరైజ్ చేసింది.


