Mamitha Baiju: మలయాళం నుంచి తెలుగు, తమిళ సినిమాల్లోకి హీరోయిన్లు రావడం కొత్తేమీ కాదు. కానీ, వచ్చిన అతి తక్కువ టైంలోనే… విజయ్, సూర్య లాంటి బిగ్గెస్ట్ స్టార్స్‌తో ఒకేసారి సినిమాలు చేసే అరుదైన అవకాశం దక్కించుకోవడం అంటే, అది మామూలు విషయం కాదు. మమితా బైజు… ‘ప్రేమలు’ సినిమాతో మొదలైన ఆమె సక్సెస్ ఇప్పటికి కొనసాగుతూనే ఉంది.
‘ప్రేమలు’ మ్యాజిక్ & ‘డ్యూడ్’ ఇంపాక్ట్
కేవలం కొన్ని నెలల కిందట రిలీజైన ‘ప్రేమలు’ సినిమా ఒక చిన్న టార్చ్ లైట్ లాంటిది. కానీ, అది సౌత్ ఇండస్ట్రీలో ఒక పెద్ద ఫోకస్ లైట్‌గా మారి, నేరుగా మమితా బైజుపై పడింది మమితా ప్రేమలు సినిమాలో చేసిన రీను పాత్ర ఎంత సహజంగా, క్యూట్‌గా ఉందంటే, తెలుగు, తమిళ యువత ఆమెను ‘క్రష్’ గా ఫీలయ్యారు. ‘రీను ఎవరు?’ అని వెతకడం మొదలుపెట్టారు. ఆ సినిమా బ్లాక్‌బస్టర్ హిట్‌తో ఆమె రెమ్యునరేషన్ పెరిగింది, కానీ అంతకంటే ముఖ్యంగా ‘డిమాండ్’ పెరిగింది.
ALSO READ: https://teluguprabha.net/cinema-news/priyadarshi-mitra-mandali-statement-backfire/
రీసెంట్‌గా రిలీజైన ‘డ్యూడ్’ సినిమా కూడా హిట్టవ్వడం, అందులో ఆమె నటనకు మంచి మార్కులు పడడంతో, ఈ సక్సెస్ లిస్ట్ మరింత స్ట్రాంగ్ అయ్యింది. ఇప్పుడు సౌత్ ఇండస్ట్రీలో శ్రీలీల, రష్మిక లాంటి బిజీ హీరోయిన్స్ కంటే కూడా మమితాకు లైన్-అప్ గట్టిగా ఉందని అంటున్నారు.
విజయ్ ‘జన నాయకన్’
తమిళంలో ‘దళపతి విజయ్’ చేస్తున్న చివరి సినిమా ‘జన నాయకన్’ H. వినోద్ దర్శకత్వం. ఈ పవర్ఫుల్ ప్రాజెక్టులో పూజా హెగ్డే మెయిన్ హీరోయిన్ అయినా, మమితా బైజు ఒక కీలక పాత్ర పోషిస్తున్నట్లు సమాచారం. విజయ్ పొలిటికల్ ఎంట్రీకి ముందు చేస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇందులో నటించడం అంటే, మమితా కెరీర్‌కు అది ఒక ‘నేషనల్ లెవెల్ మైలేజ్’ ఇచ్చినట్లే.
సూర్య 46
డైరెక్టర్ వెంకీ అట్లూరి దర్శకత్వంలో సూర్య చేస్తున్న సినిమాలో మమితా బైజు హీరోయిన్‌గా చేస్తుంది. ఇందులో సూర్య సరసన నటించడం అనేది మమితా కెరీర్‌లో ఒక ‘డ్రీమ్ కమ్ ట్రూ’ మూమెంట్ అని చెప్పవచ్చు. తెలుగు దర్శకుడి సినిమా కాబట్టి, ఈ సినిమా తెలుగులో కూడా ఆమెకు మరింత స్టార్‌డమ్‌ను తెచ్చిపెట్టే అవకాశం ఉంది.
ALSO READ: https://teluguprabha.net/cinema-news/kiran-abbavaram-double-meaning-dialogues-skn-response/
ఆమె ఫ్యూచర్ లైన్-అప్ ఈ రెండు బిగ్ ప్రాజెక్టులు కాకుండా, ధనుష్ సినిమా (D54)లో కూడా మమితా హీరోయిన్‌గా నటిస్తోంది. అలాగే తన మాతృభాష మలయాళంలోనూ నివిన్ పాలీతో కలిసి ఒక రొమాంటిక్ ఫిల్మ్ చేస్తోంది.
చిన్న సినిమాతో బ్లాక్‌బస్టర్ కొట్టి, ఆ ఫ్లోలో ఏకంగా సౌత్ ఇండియా బిగ్గెస్ట్ స్టార్స్ అయిన విజయ్, సూర్య ప్రాజెక్టులలోకి దూసుకెళ్లిన మమితా బైజు జర్నీ ఇప్పుడు ఒక హాట్ టాపిక్. తెలుగు ప్రేక్షకులు ఆమెను ‘రీను’గా ఎంతగానో ప్రేమించారు. త్వరలో ఈ పాన్-సౌత్ సినిమాలతో ఆమె మరో లెవల్‌కి వెళ్లడం పక్కా అని ఆడియన్స్ అంటున్నారు. మమితా బైజుకి ఇది నిజంగా ‘గోల్డెన్ టైమ్’ అనే చెప్పాలి.


