Manchu Lakshmi: దక్ష మూవీ ప్రమోషన్స్‌లో తలెత్తిన ఓ వివాదంపై సోషల్ మీడియా వేదికగా మంచు లక్ష్మి రియాక్ట్ అయ్యింది. ఓ వ్యక్తి నుంచి క్షమాపణ పొందడానికి తనకు మూడు వారాలు పట్టింది అంటూ ఎమోషనల్ పోస్ట్ పెట్టింది. ఇటీవల రిలీజైన దక్ష మూవీ ప్రమోషన్స్‌లో మంచు లక్ష్మి వయసు, ఆమె ధరించే దుస్తుల గురించి ఓ జర్నలిస్ట్ ప్రశ్న అడిగారు. ఆ ప్రశ్నకు హర్ట్ అయిన మంచు లక్ష్మి సదరు జర్నలిస్ట్‌పై ఫిలిం ఛాంబర్‌లో కంప్లైంట్ ఇచ్చింది. ఆ జర్నలిస్ట్ అడిగిన ప్రశ్న తన వ్యక్తిగత గౌరవాన్ని కించపరిచేలా ఉందంటూ కంప్లైంట్‌లో పేర్కొన్నది. ఆ జర్నలిస్ట్ తనకు బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసింది. ఆ జర్నలిస్ట్ క్షమాపణ చెబుతూ ఓ వీడియో రిలీజ్ చేశారు.
ఈ వివాదం గురించి సోషల్ మీడియాలో సుదీర్ఘ పోస్ట్ పెట్టింది మంచు లక్ష్మి. “నేను ఈ సారి మౌనంగా ఉండాలని అనుకోలేదు. నాకోసం ఎవరూ నిలబడరని నాకు తెలుసు. నా కోసం నేనే నిలబడ్డాను. నాకు కావాల్సింది కేవలం ఒక నిజమైన క్షమాపణ, బాధ్యతను స్వీకరించడం మాత్రమే” అని మంచు లక్ష్మి ఈ పోస్ట్‌లో పేర్కొన్నది. “ఇలాంటి చిన్న చిన్న ప్రతిఘటనలే ఆడవాళ్ల గొంతుని మూగబోకుండా కాపాడుతాయి. నా కంటే ముందు ధైర్యంగా మాట్లాడిన ఆడవాళ్ల వరుసలోనే నేనూ నిలబడి ఉన్నాను. వారి ధైర్యమే నాకు ఈ రోజు బలాన్నిచ్చింది” అని మంచు లక్ష్మి అన్నది.
Also Read – AI in School: విద్యారంగంలో పెను మార్పు.. పాఠశాల కరిక్యులమ్‌లో ఏఐ!
పత్రికా రంగం వృత్తిపై తనకు చాలా గౌరవముందని, ప్రజలకు నిజం తెలియజేయడంలో ప్రాణం పెట్టే జర్నలిస్టులు ఈ సమాజానికి వెలుగు చూపే దీపాల్లాంటి వారు అని మంచు లక్ష్మి చెప్పింది. కానీ ఆ శక్తిని సార్థకమైన సంభాషణల కంటే వ్యక్తిగత దాడుల కోసం వాడినప్పుడు అది ఎంతో బాధను కలిగిస్తుందని పేర్కొన్నది.
“నేను ఈ విషయాన్ని ప్రశాంతంగా ముగిస్తున్నాను. ఇకపైన కూడా ఆత్మగౌరవంతో నడవబోతున్నాను” అని తెలిపింది. ఆ జర్నలిస్ట్ క్షమాపణ లేఖను సోషల్ మీడియాలో షేర్ చేసింది.
దక్ష మూవీలో హీరోయిన్‌గా నటిస్తూనే ఈ సినిమాను స్వయంగా మంచు లక్ష్మి ప్రొడ్యూస్ చేసింది. మంచు లక్ష్మి తండ్రి, సీనియర్ నటుడు మోహన్‌బాబు కీలక పాత్ర పోషించారు. మెడికల్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ మూవీ డిజాస్టర్‌గా నిలిచింది. ఇటీవలే హైదరాబాద్ నుంచి ముంబాయికి షిప్టయిన మంచు లక్ష్మి కొన్నాళ్లుగా అక్కడే ఉంటుంది.
Also Read – Aishwarya Arjun: అర్జున్ కూతురు అందానికి ఎవరైనా ఫిదా కావాల్సిందే..!


