Manchu Manoj: మంచు ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరోలలో మనోజ్ కి మన తెలుగు ప్రేక్షకుల్లో మంచి క్రేజ్ ఏర్పడింది. బాల నటుడిగా తెలుగు తెరకి పరిచయమైన మనోజ్, ఆ తర్వాత హీరోగా మారి మంచి హిట్స్ కూడా అందుకున్నారు. కానీ, అనూహ్యంగా మనోజ్ కి ఫ్లాప్స్ వచ్చాయి. ఆ తర్వాత పర్సనల్ ఇష్యూస్ వల్ల దాదాపు 9 ఏళ్ళు సినిమాలు చేయకుండా దూరంగా ఉన్నారు. ఎట్టకేలకి మళ్ళీ 9 ఏళ్ళ తర్వాత భైరవం సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చారు. ఈ సినిమాలో మనోజ్ నటనకి మంచి అప్లాజ్ వచ్చింది.
ఇక రీసెంట్ గా వచ్చిన మిరాయ్ సినిమా మనోజ్ కి విలన్ గా చాలామంచి పేరును తెచ్చిపెట్టింది. యంగ్ హీరో తేజ సజ్జా నటించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంది. సినిమాటోగ్రాఫర్ కం డైరెక్టర్ కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాను టీజీ విశ్వప్రసాద్ నిర్మించారు. దాదాపు 60 కోట్ల బడ్జెట్ తో నిర్మించారు. ఇప్పటికే 150 కోట్లకి పైగా వసూళ్ళు సాధించింది. హీరోతో పోటీగా విలన్ గా నటించిన మనోజ్ ఒక్కసారిగా ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయ్యాడు.
Also Read – CM Revanth Reddy: హైదరాబాద్ పక్కన మరో అద్భుతం.. భారత్ ఫ్యూచర్‌సిటీకి సీఎం రేవంత్‌రెడ్డి శ్రీకారం!
అంతేకాదు, ఒకప్పుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మనోజ్ కి చెప్పిన మాట ఇప్పుడు నిజమైంది. ఆయన సలహా మేరకే మనోజ్ విలన్ గా నటించడానికి రెడీ అయి సక్సెస్ కూడా అయ్యాడు. ఇక ఇటీవల ఓ యాడ్ షూట్ లో యంగ్ టైగర్ ఎన్‌టిర్ కి గాయం అయిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో భారీ యాక్షన్ సినిమాను చేస్తున్న తారక్.. మరోవైపు కమర్షియల్ యాడ్ ఫిలింస్ లో కూడా నటిస్తున్నారు. అయితే, ఎన్‌టిర్ కి గాయం కావడానికి నేనే కారణం అని మంచు మనోజ్ చెప్పడం ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయింది.
అయితే, ఆ గాయం ఇప్పటిది కాదట. చిన్నప్పుడు ఇద్దరు ఆడుకునే సమయంలో ఓ బెలూన్ అంటించగా, అది తారక్ చేతికి తగిలి గాయం అయినట్టుగా చెప్పుకొచ్చాడు మనోజ్. ఆ గాయం ఇప్పుడు చూసిన చాలా గిల్టీగా ఉంటుందని చెప్పుకొచ్చాడు. ఇక ఇద్దరి బర్త్ డే ఒకే రోజు అన్న సంగతి తెలిసిందే. చిన్నప్పటి నుంచి ఎన్‌టిర్, మనోజ్ చాలా క్లోజ్ గా ఉంటారు. తెగ అల్లరి చేసేవారు. ఇక తారక్ ప్రస్తుతం చేతికి తగిలిన గాయం వల్ల రెస్ట్ తీసుకుంటున్నారట. మనోజ్ విషయానికొస్తే త్వరలో మెగాస్టార్ చిరంజీవి నటించబోతున్న సినిమాలో ఓ కీలక పాత్రను పోషించనున్నట్టుగా సమాచారం.
Also Read – Oppo Pad 5: ColorOS 16తో ఒప్పో ప్యాడ్ 5.. లాంచ్ డేట్ ఫిక్స్..


