Sunday, June 30, 2024
Homeచిత్ర ప్రభManchu marriage: రెండో పెళ్లి చేసుకుంటున్న హీరో మనోజ్

Manchu marriage: రెండో పెళ్లి చేసుకుంటున్న హీరో మనోజ్

అందరూ ఊహించినట్టే, ఇన్ని రోజులు ప్రచారం సాగినట్టే మంచు మనోజ్ మళ్లీ పెళ్లి చేసుకుంటున్నారు. భూమా దంపతుల రెండవ కుమార్తె భూమా మౌనిక రెడ్డిని మనోజ్ ఈరోజు రాత్రి వివాహం చేసుకోబోతున్నారు. మనోజ్ అక్క మంచు లక్ష్మి ఇంట్లో వీళ్ల వివాహం సన్నిహితుల మధ్య జరుగనుంది. గతకొంతకాలంగా వీరు బహిరంగంగానే ప్రేమలో ఉన్నారు.

- Advertisement -

వీళ్లిద్దరూ గతంలో వివాహం చేసుకుని, విడాకులు తీసుకున్నవారే. కాగా చాలాకాలంగా భూమా, మంచు కుటుంబాల మధ్య మంచి సాన్నిహిత్యం ఉంది. ఈ పరిచయమే మనోజ్-మౌనికల మధ్య ప్రేమగా మారింది. కాగా గత కొంతకాలంగా వీళ్లద్దరూ చెట్టాపట్టాలు వేసుకుని పలు కార్యక్రమాల్లో కలిసి తిరుగుతూనే ఉన్నారు.

భూమా దంపతుల ఇద్దరు అమ్మాయిలూ రెండవ పెళ్లి చేసుకోవటం ఇక్కడ విశేషంగా నంద్యాల, ఆళ్లగడ్డ ప్రజలు చర్చించుకుంటున్న హాట్ టాపిక్ గా మారింది.

భూమా మౌనికా రెెడ్డి మొదటి పెళ్లి ఫోటో
మంచు మనోజ్ మొదటి పెళ్లి ఫోటో
సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News