Kannappa OTT: మంచు విష్ణు కన్నప్ప ఓటీటీ రిలీజ్ డేట్ ఖరారైంది. స్ట్రీమింగ్ డేట్‌ను సోమవారం ఓ వీడియో ద్వారా మంచు విష్ణు అఫీషియల్‌గా ప్రకటించారు. సెప్టెంబర్ 4న అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ మూవీ రిలీజ్ కాబోతుంది. తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో రిలీజ్ అవుతోంది. థియేటర్లలో రిలీజైన రెండు నెలల తర్వాత కన్నప్ప ఓటీటీలోకి రాబోతుంది.
ప్రభాస్ స్పెషల్ రోల్…
మంచు విష్ణు హీరోగా నటిస్తూ నిర్మించిన ఈ మూవీలో ప్రభాస్ ఓ స్పెషల్ రోల్ చేశాడు. అక్షయ్ కుమార్, మోహన్‌బాబు, శరత్‌కుమార్, మోహన్‌లాల్, కాజల్ అగర్వాల్ కీలక పాత్రలు పోషించారు. ప్రీతి ముకుందన్ హీరోయిన్‌గా నటించింది. మహాభారతం సీరియల్ ఫేమ్ ముఖేష్ కుమార్ సింగ్ కన్నప్ప మూవీకి దర్శకత్వం వహించాడు. మంచు విష్ణు కెరీర్‌లోనే మోస్ట్ ప్రెస్టిజీయస్ మూవీగా రూపొందిన కన్నప్ప జూన్ నెలాఖరున థియేటర్లలో రిలీజైంది. భారీ అంచనాల నడుమ ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ మైథలాజికల్ మూవీ డిజాస్టర్‌గా నిలిచింది. దాదాపు 200 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన కన్నప్ప యాభై కోట్ల లోపే వసూళ్లను దక్కించుకున్నది.
మంచు విష్ణు నటనకు ప్రశంసలు…
కన్నప్ప జీవితాన్ని భక్తి అంశాలతో ఆసక్తికరంగా చెప్పడంలో దర్శకుడు తడబడిపోయాడు. ప్రభాస్ రోల్ మినహా మిగిలిన అంశాలేవి ప్రేక్షకకులను మెప్పించలేకపోయాయి. మంచువిష్ణు నటన మాత్రం బాగుందనే కామెంట్స్ వినిపించాయి. తిన్నడిగా, కన్నప్పగా డిఫరెంట్ షేడ్స్‌తో కూడిన క్యారెక్టర్‌లో చక్కటి వేరియేషన్ చూపించాడనే ప్రశంసలు వచ్చాయి.
రెమ్యూనరేషన్ లేకుండా…
హీరోగా నటిస్తూనే ఈ సినిమాకు కథ, స్క్రీన్‌ప్లేను మంచు విష్ణు అందించాడు. ప్రభాస్ రెమ్యూనరేషన్ లేకుండా ఉచితంగా ఈ సినిమాలో నటించాడు. రుద్ర అనే పాత్రను పోషించారు.
కన్నప్ప కథ ఇదే
తిన్నడు (మంచు విష్ణు) నాస్తికుడు. దేవుడు లేడన్నది అతడి సిద్ధాంతం. అమ్మవారికి ఇచ్చే బలి విషయంలో తండ్రి నాథనాథుడిని (శరత్‌కుమార్) ఎదురించి తాను పుట్టిపెరిగిన గూడెం నుంచి బహిష్కరణకు గురవుతాడు. ఆ సంఘటన తిన్నడి జీవితాన్ని ఎలాంటి మలుపు తిప్పింది? నాస్తికుడైన తిన్నడు శివుడి పరమభక్తుడైన కన్నప్పగా ఎలా మారాడు? అతడి జీవితంలోకి వచ్చిన రుద్ర (ప్రభాస్), మహాదేవశాస్త్రి (మోహన్‌బాబు) ఎవరు? తిన్నడి కోసం అతడిని ప్రేమించిన నెమలి ఎలాంటి త్యాగానికి సిద్ధపడింది అన్నదే ఈ మూవీ కథ.


