Manchu Vishnu: మంచు ఫ్యామిలీలోని విభేదాలు కొన్ని నెలల క్రితం టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారాయి. మోహన్‌బాబు తనయులు మంచు విష్ణు, మనోజ్ ఒకరిపై మరొకరు తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేసుకున్నారు. దాడులు, పోలీస్ కేసుల వరకు ఈ వ్యవహారం వెళ్లింది. దాదాపు నెల రోజుల పాటు మంచు బ్రదర్స్ హైడ్రామా నడిచింది. మంచు సోదరుల మధ్య నెలకొన్న వివాదానికి పుల్‌స్టాప్ పడ్డట్టుగా కనిపిస్తోంది.
కన్నప్ప రిలీజ్ టైమ్‌లో…
మంచు విష్ణు, మోహన్‌బాబు హీరోలుగా నటించిన కన్నప్ప రిలీజ్ టైమ్‌లో సినిమాను ఉద్దేశిస్తూ మంచు మనోజ్ పాజిటివ్ ట్వీట్ చేశాడు. సినిమా కూడా చూశాడు. ఆ తర్వాత మంచు విష్ణు కొడుకు అవ్రామ్‌కు అవార్డు వచ్చినప్పుడు కూడా సోషల్ మీడియా ద్వారా మనోజ్ రియాక్ట్ అయ్యాడు. తన ట్వీట్‌లో విష్ణు, మోహన్‌బాబు పేర్లు ప్రస్తావించాడు.
Also Read- Paradha OTT: సడెన్‌గా ఓటీటీలోకి వచ్చిన అనుపమ పరమేశ్వరన్ పరదా మూవీ – ఎందులో చూడాలంటే?
ఆల్ ది బెస్ట్…
తాజాగా మంచు మనోజ్ ప్రధాన పాత్రలో నటించిన మిరాయ్ మూవీ శుక్రవారం (నేడు) థియేటర్లలో రిలీజైంది. ఈ సందర్భంగా మిరాయ్ టీమ్‌కు ట్విట్టర్ ద్వారా ఆల్ ది బెస్ట్ చెప్పాడు మంచు విష్ణు. ఆ దేవుడి అండతో టీమ్ అందరికి మంచి జరగాలి అంటూ తన ట్వీట్‌లో మంచు విష్ణు పేర్కొన్నాడు. ఈ ట్వీట్‌లో తేజా సజ్జా, మనోజ్‌తో పాటు ఎవరి పేర్లను ట్యాగ్ చేయలేదు విష్ణు. కేవలం సినిమా టైటిల్‌ను మాత్రమే ప్రస్తావించారు. మంచు విష్ణు చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Wishing all the best for #Mirai. God speed to the entire team.
— Vishnu Manchu (@iVishnuManchu) September 12, 2025
ట్విస్ట్ ఎక్స్‌పెక్ట్ చేయలేదు…
ఈ ట్విస్ట్‌ను ఎక్స్‌పెక్ట్ చేయలేదంటూ మంచు విష్ణు ట్వీట్‌ను ఉద్దేశించి నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. మంచు బ్రదర్స్ మధ్య గొడవలు సమసిపోయినట్లే కనిపిస్తున్నాయని మరికొందరు పేర్కొన్నారు. మిరాయ్ సినిమా చూసి విష్ణు ట్వీట్ చేస్తే బాగుండేదని అంటున్నారు.
Also Read- Kishkindhapuri Review: బెల్లంకొండ సాయి శ్రీనివాస్, అనుపమల ‘కిష్కింధపురి’ మూవీ రివ్యూ
మహావీర్ లామా…
మిరాయ్ మూవీలో మంచు మనోజ్ విలన్‌గా నటించాడు. మహావీర్ లామా అనే క్యారెక్టర్‌లో కనిపించాడు. ఈ పాత్రలో మనోజ్ లుక్, డైలాగ్ డెలివరీ బాగున్నాయంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి. మనోజ్ అదిరిపోయే కమ్‌బ్యాక్ ఇచ్చాడని నెటిజన్లు చెబుతున్నారు. తేజా సజ్జా హీరోగా నటించిన ఈ మూవీకి కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహించాడు. భైరవం తర్వాత మనోజ్ చేసిన సినిమా ఇది. భైరవంలోనూ నెగెటివ్ షేడ్స్‌తో కూడిన పాత్ర చేశాడు మనోజ్.


