Mani Ratnam Telugu Movies: ఇప్పుడంటే పాన్ ఇండియా సినిమాలంటూ మనం మాట్లాడుతున్నాం. కానీ అలాంటి సినిమాలతో ఎప్పుడు సినీ ప్రేక్షకులను మెస్మరైజ్ చేసిన అరుదైన దర్శకుడు మణిరత్నం. ఈయన గురించి మూవీ లవర్స్‌కు ప్రత్యేకమైన పరిచయం అక్కర్లేదు. ప్రేమకథా చిత్రాలు చేయటంలో ఈయనకొక సెపరేట్ స్టైల్ ఉంటుందని టాక్. అయితే ఆయన మూడు దశాబ్దాలకు పైగా టాలీవుడ్‌కు దూరంగా ఉంటున్నారు. కోలీవుడ్ సినిమాలకే ప్రాధాన్యత ఇస్తూ వస్తున్నారు. అయితే గత కొంతకాలంగా ఈ ఏస్ డైరెక్టర్‌కు అన్నీ ఫ్లాప్సే ఎదురవుతున్నాయి. దీంతో ఆయన మళ్లీ టాలీవుడ్‌పై దృష్టి పెట్టారని న్యూస్ వైరల్ అవుతోంది.
మణిరత్నం తెలుగులో తెరకెక్కించిన ఏకైక చిత్రం 1989లో విడుదలైన ‘గీతాంజలి’. నాగార్జున కథానాయకుడిగా తెరకెక్కిన ఈ చిత్రం అద్భుతమైన విజయాన్ని సాధించి తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేసింది. దర్శకుడిగా తెలుగులో ఆయనకు అదే తొలి చిత్రం. అప్పటికే మలయాళం, తమిళం, కన్నడ భాషల్లో సినిమాలు చేసి తనదైన ముద్ర వేసుకున్న మణిరత్నం.. ‘గీతాంజలి’తో టాలీవుడ్‌లోనూ బ్లాక్ బస్టర్ సక్సెస్ సొంతం చేసుకున్నారు. అయితే కారణాలు తెలియలేదు కానీ ఆ తర్వాత ఆయన మళ్లీ తెలుగు పరిశ్రమ వైపు చూడలేదు.
‘గీతాంజలి’ తర్వాత తెలుగు సినిమా చేయాలని అనేక మంది టాలీవుడ్ ఫిల్మ్ మేకర్స్ మణిరత్నంను సంప్రదించినా ఆయన పట్టించుకోలేదు. తన దృష్టంతా తమిళ చిత్రాలపైనే కేంద్రీకరించారు. మధ్యలో కొన్ని హిందీ చిత్రాలు చేసినప్పటికీ, అవి కూడా ఒక ఎంట్రీలాగే ఉన్నాయని చెప్పొచ్చు. ఆయన ఏ సినిమా తీసినా కోలీవుడ్‌లోనే తీస్తానన్నట్లు పనిచేశారు, అక్కడ తీసిన చిత్రాలనే తెలుగులో అనువదించారు. అయినప్పటికీ, ఆయనకు ఉన్న పాన్ ఇండియా గుర్తింపు కారణంగా ఆయన దర్శకత్వం వహించిన ప్రతీ సినిమా హిందీతో సహా ఇతర భాషల్లోనూ తప్పక విడుదలవుతూ ఉంటాయి.
ALSO READ: https://teluguprabha.net/cinema-news/ravi-teja-and-sreeleela-movie-mass-jathra-will-postpone-again/
మణిరత్నం దర్శకత్వం వహించిన సినిమాలు తక్కువే అయినా క్లాసిక్ మూవీస్‌గా నిలిచిపోయాయి. అయితే ఆయన కెరీర్‌లో ప్లాప్‌లు లేవని కాదు కొన్ని అట్టర్ ప్లాప్‌లు కూడా ఉన్నాయి. ఆయన డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన పొన్నియన్ సెల్వన్ విజయం సాధించినప్పటికీ, ఆ తర్వాత చేసిన థగ్ లైఫ్ దారుణమైన ఫలితాన్ని చవిచూసింది. తన నాలుగు దశాబ్దాల సినీ కెరీర్‌లో ఏనాడూ క్షమాపణ చెప్పని మణిరత్నం థగ్ లైఫ్ విషయంలో తొలిసారి మీడియా ముందు క్షమాపణలు సైతం చెప్పాల్సి వచ్చింది.
ALSO READ: https://teluguprabha.net/cinema-news/pawan-kalyan-upcoming-movie-og-bad-sentiment-tension-for-fans/
ఈ నేపథ్యంలో మణిరత్నం తెలుగులో సినిమా చేయాలనుకుంటున్నారనే వార్త ప్రాధాన్యతను సంతరించుకుంది. అందులోనూ అక్కినేని వారసుడు నాగచైతన్యతో తన మార్క్ ప్యూర్ లవ్ స్టోరీ చేయాలని ఆయన ప్లాన్ చేస్తున్నారని టాక్. నాగార్జునకు గీతాంజలితో గొప్ప విజయాన్ని అందించిన మణిరత్నం.. ఇప్పుడు తనయుడు నాగచైతన్యకు కూడా అలాంటి అద్భుతమైన ప్రేమకథ ‘గీతాంజలి’తో హిట్ ఇవ్వాలని భావిస్తున్నారేమోనని సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. మణిరత్నం వంటి దిగ్గజ దర్శకుడు తెలుగు సినిమాకు తిరిగి రావడం..అది కూడా గీతాంజలికి కొనసాగింపుగా భావించే ప్రేమకథతో కావడం అభిమానులకు పెద్ద పండుగేనని చెప్పాలి. మరిందులో నిజానిజాలేంటో తెలియాలంటే కొన్నాళ్లు ఆగాల్సిందే.


