Sachin Chandwade: బాలీవుడ్ యువ నటుడు సచిన్ చాంద్‌వడే ఆత్మహత్య చేసుకున్నాడు. పాతికేళ్ల వయసులో సచిన్ ఈ కఠినమైన నిర్ణయం తీసుకుని చనిపోవటం బాధాకరం. తను చనిపోయిన కొన్ని రోజుల తర్వాత కానీ విషయం బయటకు రాలేదు. వార్త తెలియగానే బాలీవుడ్ షాక్‌కి గురైంది. మహారాష్ట్రలోని ఉందిర్ ఖేడ్‌లో అక్టోబర్ 23న సచిన్ ఆత్మహత్య చేసుకున్నాడు. వెంటనే కుటుంబ సభ్యులు అతన్ని హాస్పిటల్‌కు తరలించినప్పటికీ ఉపయోగం లేకుండా పోయింది.
Also Read – Sreeleela: పెళ్లిపై శ్రీలీల ఓపెన్ కామెంట్స్
సాఫ్ట్ వేర్ ఉద్యోగి అయిన సచిన్ చాంద్‌వడే సినిమాలపై మక్కువతో సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు. జాంతాడా 2 వెబ్ సిరీస్‌తో నటుడిగా మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. ఆయన ఇప్పుడు చేస్తోన్న చిత్రం అసురవన్. చిత్రీకరణ దశలో ఉంది. ఇందులో సోము అనే పాత్రను సచిన్ పోషిస్తున్నాడు. ఇదే విషయాన్ని తను తన ఇన్‌స్టాలో చివరి పోస్ట్‌గా కొన్ని రోజుల ముందు పోస్ట్ చేశాడు.
Also Read – బిగ్ బాస్ హౌస్ లో పాత కంటెస్టెంట్ రీ ఎంట్రీ.. నామినేట్ చేస్తూ ఒక్కొక్కరి మాస్క్ తీసేస్తూ


