Naga Vamsi: నిర్మాత నాగ వంశీ పేరు టాలీవుడ్‌లో ఇటీవల బాగా వినిపిస్తోంది. ముఖ్యంగా ఆయన నిర్మాణంలో వచ్చిన కొన్ని సినిమాలు, డిస్ట్రిబ్యూషన్ చేసిన భారీ సినిమాలు ఇచ్చిన షాకుల కారణంగా. మాస్ మహారాజా రవితేజ, శ్రీలీల కాంబినేషన్‌లో నాగ వంశీ నిర్మించిన ‘మాస్ జాతర’ సినిమా విడుదల ఆలస్యం కావడానికి గల అసలు కారణాన్ని ఆయన తాజాగా వెల్లడించాడు.
వాయిదా వెనుక అసలు కారణం! సోషల్ మీడియా ట్రోలింగ్!
‘మాస్ జాతర’ సినిమా విడుదల పలుమార్లు వాయిదా పడుతూ వచ్చింది. ఈ ఆలస్యం వెనుక ఉన్న ప్రధాన కారణం ఏంటంటే, ఇటీవల నాగ వంశీ ఎదుర్కొన్న తీవ్రమైన సోషల్ మీడియా ట్రోలింగ్, నెగెటివిటీనే.
తను నిర్మించిన ‘కింగ్డమ్’ సినిమా అలాగే ముఖ్యంగా ఎన్టీఆర్, హృతిక్ రోషన్ నటించిన ‘వార్ 2’ తెలుగు వెర్సన్ హక్కులను భారీ ధరకు కొని విడుదల చేసారు, ఈ రెండు సినిమాల బాక్సాఫీస్ ఫలితాలు ఆశించిన స్థాయిలో లేకపోవడంతో, నిర్మాత నాగ వంశీపై సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోలింగ్ మొదలైంది.
ALSO READ: https://teluguprabha.net/cinema-news/upasana-twins-rumours-allu-family-missing-mega-event/
ముఖ్యంగా ‘వార్ 2’ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో ఆయన మాట్లాడిన మాటలు, ఆ తర్వాత సినిమా ఫలితం తేడా కొట్టడంతో, నెటిజన్లు దారుణంగా ఎగతాళి చేశారు. “తాను ఆస్తులు అమ్ముకుని దుబాయ్ కి వెళ్లిపోయాడు” అనే స్థాయిలో కూడా తనపై ట్రోల్స్ జరిగాయని, మీడియా కూడా ఒక వీకెండ్‌లో తనను ఆడుకుందని నాగ వంశీ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పేర్కొన్నారు.
‘మాస్ జాతర’ పై ప్రభావం పడకూడదనే…
ఒక ఇంటర్వ్యూ లో నాగ వంశీ మాట్లాడుతూ, “మనిషి అన్న తర్వాత తప్పులు జరుగుతుంటాయి. ‘వార్ 2’ విషయంలో తప్పు జరిగింది, మిస్ ఫైర్ అయింది. మేము ఆదిత్య చోప్రా లాంటి పెద్ద మనిషిని, యష్ రాజ్ ఫిలిమ్స్‌ని నమ్మాం. వాళ్ల సైడ్ తప్పు జరిగితే, మేము దొరికిపోయాం అంతే. అది నేను తీసిన సినిమా కాదు, కానీ ఆ నెగెటివిటీని మేము ఫేస్ చేశాం.” అని చెప్పుకొచ్చారు.
ఈ తీవ్రమైన నెగెటివిటీ, ట్రోలింగ్ తన సొంత చిత్రం ‘మాస్ జాతర’పై పడి, సినిమాకు నష్టం చేకూర్చే అవకాశం ఉందని భావించానని, అందుకే, ఆ నెగిటివిటీ తగ్గే వరకు ఎదురుచూసి, సరైన సమయంలో సినిమాను విడుదల చేయాలనే నిర్ణయంతోనే ‘మాస్ జాతర’ విడుదలను వాయిదా వేశానని నాగ వంశీ స్పష్టం చేశారు. ఈ సందర్భంగా, ఆస్తులు అమ్ముకొని దుబాయ్ వెళ్లారనే ట్రోలింగ్‌కు “ఆస్తులు అమ్ముకునేంత బ్యాడ్ పొజిషన్‌లో ఉంటే, దుబాయ్ ఎలా వెళ్తాం? బాధపడటానికి కూడా రిచ్ కంట్రీకి వెళ్తారని అనుకున్నారేమో” అని సరదాగా కౌంటర్ ఇచ్చారు.
ALSO READ: https://teluguprabha.net/cinema-news/prabhas-fauji-kannada-actress-chaitra-j-achar-cast-update/
మొత్తానికి, ఒక డిస్ట్రిబ్యూటర్‌గా ఎదురైన ఫ్లాప్‌కు సంబంధించిన నెగెటివిటీని తన సొంత సినిమాకు దూరం చేయాలనే ఉద్దేశంతోనే ‘మాస్ జాతర’ను వాయిదా వేయాల్సి వచ్చిందని నిర్మాత నాగ వంశీ స్పష్టం చేశారు. ప్రస్తుతం ఆ ట్రోలింగ్ వేడి తగ్గడంతో, ఉత్సాహంగా సినిమా ప్రమోషన్స్ మొదలుపెట్టి, సినిమాను విడుదల చేయడానికి సిద్ధమవుతున్నారు. ఈ మూవీ అక్టోబర్ 31 న మన ముందుకు రాబోతుంది.


