Sunday, October 6, 2024
Homeచిత్ర ప్రభRaviTeja: మాస్ రాజా వారసత్వం డైలాగ్.. ఇండస్ట్రీలో ఇదో హాట్ టాపిక్!

RaviTeja: మాస్ రాజా వారసత్వం డైలాగ్.. ఇండస్ట్రీలో ఇదో హాట్ టాపిక్!

- Advertisement -

RaviTeja: వెనుకున్న వాళ్లను చూసుకుని ముందుకొచ్చిన వాడిని కాదురోయ్..వెనకెవడు లేకపోయినా ముందుకు రావొచ్చు అని ఎగ్జాంపుల్ సెట్ చేసిన వాడిని`.. ఈ డైలాగ్ చూశారా.. వారసత్వంగా వచ్చిన హీరోల అభిమానులకు ఎక్కడో కాలినట్లుంది కదా!. వారసత్వంగా వెనక తండ్రులను, తాతలను చూసుకొని ఇండస్ట్రీకి వచ్చిన హీరోలను అన్నట్లే ఉన్న ఈ డైలాగ్ ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. మాస్ మహారాజా రవితేజ ధమాకాలో అదే తరహా డైలాగులతో మోతెక్కిస్తున్నాడు.

నిజానికి ఇలాంటి డైలుగులు రవితేజ నుండి ఇప్పుడు కొత్తేమి కాదు. క్రాక్ మూవీలో బ్యాక్ గ్రౌండ్ అనే పదం వినిపిస్తే రవితేజ ఆ పదం అన్నవారిని చితగ్గొట్టేస్తాడు. బెంగాల్ టైగర్ లో నేను సపోర్ట్ తో పైకి వచ్చినవాడిని కాదు అనే డైలాగ్, రామారావు ఆన్ డ్యూటీలో లక్కుతో పైకి రాలేదు లాంటి డైలాగులున్నాయి. ఇక, ఇప్పుడు ధమాకా కోసం కాస్త క్లారిటీగా డైరెక్ట్ గానే డైలాగ్ పెట్టేశారు.

అయితే, గతంలో ఎప్పుడూ ఇంతగా రవితేజ డైలాగులపై చర్చ లేదు కానీ.. ఇప్పుడు ధమాకాలో డైలాగ్ గురించి మాత్రం కాస్త గట్టిగానే చర్చలు జరుగుతున్నాయి. ఒకవైపు స్టార్ ఫ్యామిలీల నుండి వచ్చిన హీరోల అభిమానులు సోషల్ మీడియాలో ఈ డైలాగ్ పై తెగ కామెంట్లు చేస్తుంటే.. ఇండస్ట్రీలో కూడా ఈ డైలాగ్ ఎందుకు పెట్టారు.. ఎవరిని ఉద్దేశించి పెట్టారని ఆరాలు తీస్తున్నారు. మరి.. ఈ డైలాగ్ వెనకున్న ఆ హీరోలు ఎవరో డైలాగ్ రాసిన వాళ్ళకే తెలియాలి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News