Thursday, May 1, 2025
Homeచిత్ర ప్రభWAVES: 'వేవ్స్‌' సమ్మిట్‌కు హాజ‌రైన చిరంజీవి

WAVES: ‘వేవ్స్‌’ సమ్మిట్‌కు హాజ‌రైన చిరంజీవి

ముంబైలోని జియో వ‌రల్డ్ సెంట‌ర్‌లో ప్ర‌పంచ ఆడియో విజువ‌ల్ అండ్ ఎంట‌ర్‌టైన్‌మెంట్ స‌మ్మిట్ (WAVES) 2025 ప్రారంభ‌మైంది. ఈ మెగా ఈవెంట్‌కు మెగాస్టార్ చిరంజీవి, సూపర్ స్టార్ రజనీకాంత్, బాలీవుడ్ న‌టులు ఆమిర్ ఖాన్‌, అక్ష‌య్ కుమార్, మోహ‌న్‌లాల్ త‌దిత‌రులు హాజరయ్యారు. వీరికి నిర్వాహ‌కులు ఘ‌న స్వాగ‌తం పలికారు. కేంద్ర సమాచార ప్ర‌సార మంత్రిత్వ శాఖ‌, మ‌హారాష్ట్ర ప్ర‌భుత్వం సంయుక్తంగా నిర్వ‌హిస్తున్నాయి.

- Advertisement -

ఇక ప్రధాని మోదీ మొదటి ప్రపంచ ఆడియో విజువల్ అండ్‌ ఎంటర్‌టైన్‌మెంట్ సమ్మిట్‌ను ప్రారంభించారు. అనంతరం మీడియా, వినోద రంగానికి చెందిన సీఈవోలు, పరిశ్రమల ప్రముఖులతో భేటీ కానున్నారు. ఈ కార్య‌క్ర‌మం కోసం ప్రధాని ఏకంగా 10 గంట‌ల స‌మ‌యాన్ని కేటాయించ‌డం విశేషం.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News