Chiru-Bobby: సినిమాల జోరును పెంచుతున్నారు మెగాస్టార్ చిరంజీవి. ప్రస్తుతం విశ్వంభరతో పాటు అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు చిరంజీవి. ఈ రెండు సినిమాల షూటింగ్‌లతో ఫుల్ బిజీగా ఉన్నారు మెగాస్టార్. వీటితో పాటు హీరో నాని నిర్మాతగా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో రూపొందనున్న మూవీలో చిరంజీవి హీరోగా కనిపించబోతున్నాడు.
వాల్తేర్ వీరయ్య దర్శకుడితో…
తాజాగా చిరంజీవి మరో ప్రాజెక్ట్‌కు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. వాల్తేర్ వీరయ్య దర్శకుడు బాబీతో మరో సినిమా చేయబోతున్నారు. సెప్టెంబర్‌లో చిరంజీవి, బాబీ మూవీ సెట్స్‌పైకి రానున్నట్లు సమాచారం. వాల్తేర్ వీరయ్య సినిమాను నిర్మించిన మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌లోనే ఈ భారీ బడ్జెట్ మూవీ తెరకెక్కనుంది.
చిరంజీవి ఇమేజ్‌కు తగ్గట్లుగా పవర్‌ఫుల్ యాక్షన్ ఎంటర్‌టైనర్ స్క్రిప్ట్‌ను బాబీ సిద్ధం చేసినట్లు సమాచారం. యాక్షన్ కంటే కామెడీ, ఫ్యామిలీ ఎమోషన్స్‌కు ఇందులో ఎక్కువగా స్కోపు ఉండబోతున్నట్లు తెలిసింది. చిరంజీవి రోల్ కూడా డిఫరెంట్‌గా ఉంటుందని అంటున్నారు. ఈ సినిమాకు కార్తీక్ ఘట్టమనేని సినిమాటోగ్రాఫర్‌గా పనిచేయబోతున్నాడు. చిరంజీవి 158వ మూవీగా ఇది రూపొందనున్నట్లు చెబుతోన్నారు.
Also Read – Telangana Cabinet: కొనసాగుతున్న తెలంగాణ కేబినెట్.. ఆ రిపోర్టుపై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోనుంది?
సెప్టెంబర్‌లో…
సెప్టెంబర్ లోగా అనిల్ రావిపూడి సినిమా షూటింగ్‌ను కంప్లీట్ చేసి బాబీ మూవీని పట్టాలెక్కించాలని చిరంజీవి ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఆ తర్వాతే శ్రీకాంత్ ఓదెల సినిమా ప్రారంభమవుతుందని అంటున్నారు.
మన శివ శంకర వర ప్రసాద్…
చిరంజీవి, అనిల్ రావిపూడి సినిమాకు మన శివ శంకర వర ప్రసాద్ అనే టైటిల్‌ను ఖరారు చేసినట్లు సమాచారం. వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ సినిమా రిలీజ్ కానుంది. ఈ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ మూవీలో హీరో వెంకటేష్ కీలక పాత్రలో కనిపించబోతున్నాడు. నయనతార హీరోయిన్‌గా నటిస్తున్న ఈ మూవీలో కేథరిన్ కూడా ఓ ఇంపార్టెంట్ రోల్‌లో నటిస్తోంది.
విశ్వంభర ఫినిష్…
మరోవైపు విశ్వంభర షూటింగ్ స్పెషల్ సాంగ్‌తో ఇటీవలే ముగిసింది. సోషియో ఫాంటసీ కథతో డైరెక్టర్ వశిష్ట మల్లిడి ఈ సినిమాను రూపొందిస్తున్నారు. త్రిష హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ సినిమా డిసెంబర్‌లో రిలీజ్ కానున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ ఏడాది సంక్రాంతికే విశ్వంభర రిలీజ్ కావాల్సింది. కానీ గేమ్ ఛేంజర్ కారణంగా వాయిదాపడింది. టీజర్‌పై విమర్శలు రావడంతో కొన్ని సీన్స్‌తో పాటు సీజీ వర్క్ మొత్తాన్ని రీ షూట్ చేసినట్లు సమాచారం.
Also Read – Naga Panchami 2025: నాగుల పంచమి రోజున అరుదైన యోగాలు.. రేపటి నుండి ఈ 3 రాశులకు అన్నీ శుభాలే..


