MITHRA MANDALI: టాలీవుడ్‌లో ఏ సినిమాకైనా బన్నీ వాస్ లాంటి పెద్ద పేరు తోడైతే, ఆ ప్రాజెక్టుకి ఆటోమేటిక్‌గా హైప్ పెరుగుతుంది. ఇప్పుడు ఆయన BV Works ద్వారా ‘మిత్ర మండలి’ లాంటి పక్కా కామెడీ ఎంటర్‌టైనర్‌ను ప్రజెంట్ చేస్తుండడంతో, సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి! హైదరాబాద్‌లో జరిగిన గ్రాండ్ లాంచ్ ఈవెంట్‌లో విడుదలైన ట్రైలర్, అక్టోబర్ 16న థియేటర్లో రిలీజ్ అవుతున్న ఈ సినిమా కి అసలు సిసలు అయినా హైప్ ఇచ్చింది.
ALSO READ: https://teluguprabha.net/cinema-news/baahubali-the-epic-phase-2-surprise/
డైరెక్టర్ విజయెందర్ ఎస్ , తెరకెక్కించిన ఈ సినిమా కథ నలుగురు స్నేహితుల చుట్టూ తిరుగుతుంది. వీళ్లు ఏ సిట్యుయేషన్‌ను సీరియస్‌గా తీసుకోని కుర్రాళ్లు. వీరి మధ్య ఉండే క్రేజీ ఫ్రెండ్‌షిప్ ఒకరిపై ఒకరు వేసుకునే హిలేరియస్ పంచ్‌లు ట్రైలర్‌లో బాగా పండాయి. ఈ నలుగురు పాత్రలు పోషించింది. ప్రియదర్శి, రాగ్ మయూర్, ప్రసాద్ బెహరా, విష్ణు ఓయ్ల వీళ్ళ కామెడీ టైమింగ్ చూస్తే… థియేటర్‌లో బాగా ఎంజాయ్ చేస్తారు అనిపిస్తుంది ! సోషల్ మీడియా సంచలనం నిహారిక ఎన్ఎమ్ ఈ మూవీతోనే టాలీవుడ్‌లోకి హీరోహిన్ గా అడుగు పెడుతోంది.
వీటీవీ గణేష్, వెన్నెల కిషోర్, సత్య లాంటి సీనియర్ కమెడియన్లు ఈ కామెడీ ట్రాక్‌కి మరింత బలాన్నిచ్చారు.అంతేకాకుండా, అనుదీప్ కె.వి. వంటి నటుల గెస్ట్ అప్పియరెన్సెస్ ప్రేక్షకులకు మరో సర్ప్రైజ్ ఫ్యాక్టర్‌ను అందించబోతున్నాయి!
ఈ సినిమాలో కేవలం నవ్వులే కాదు, ఎమోషన్ కూడా ఉంది. ఆర్.ఆర్. ధ్రువన్ అందించిన సంగీతం, కథలోని రిలేటబిలిటీని అద్భుతంగా ఎలివేట్ చేసింది.మొత్తంగా దీపావళి కి థియేటర్ కి వెళ్లి హాయిగా రెండు గంటలు సేపు నవ్వుకోవచ్చు అని మాత్రం తెలుస్తుంది ట్రైలర్ చూస్తుంటే.


