Sunday, November 16, 2025
HomeTop StoriesMithra Mandali: పక్క ఫ్యామిలీ ఎంటర్టైనర్! 'మిత్ర మండలి'కి U/A సర్టిఫికేట్...

Mithra Mandali: పక్క ఫ్యామిలీ ఎంటర్టైనర్! ‘మిత్ర మండలి’కి U/A సర్టిఫికేట్…

Mithra Mandali: ప్రియదర్శి నటన, నిహారిక ఎన్ఎమ్ కామెడీ టైమింగ్, వెన్నెల కిషోర్-సత్యల నవ్వుల ప్రవాహంతో మిమల్ని నవ్వించడానికి ‘మిత్ర మండలి’ సిద్ధమైంది. ఈ సినిమా అక్టోబర్ 16న ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా ఈ మూవీ సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుని, ఫ్యామిలీ ఆడియెన్స్‌కు పక్కా అని తెలిపే విధంగా ‘U/A’ సర్టిఫికేట్‌ను దక్కించుకుంది.

- Advertisement -

నవ్వుల సునామీకి సిద్ధమవ్వండి!

‘బివి వర్క్స్’ బ్యానర్‌పై, బన్నీ వాస్ సమర్పణలో రూపొందిన ఈ చిత్రాన్ని కళ్యాణ్ మంతిన, భాను ప్రతాప, డాక్టర్ విజయేందర్ రెడ్డి తీగల సంయుక్తంగా నిర్మించారు. టీజర్‌తో పాటు, ఇప్పటికే విడుదలైన ‘కత్తి అందుకో జానకి’, ‘జంబర్ గింబర్ లాలా’ వంటి పాటలు విపరీతమైన పాజిటివ్ బజ్‌ను క్రియేట్ చేశాయి.

ALSO READ: https://teluguprabha.net/cinema-news/funky-teaser-review-vishwak-sen-anudeep-kv/

నిర్మాత బన్నీ వాస్: మా ‘లిటిల్ హార్ట్స్‌’ ఎంతగా నవ్వించిందో, ఈ ‘మిత్ర మండలి’ అంతకు మించే నవ్విస్తుంది. సినిమా చూసి మీరు నవ్వి నవ్వి కడుపునొప్పితో థియేటర్ నుంచి బయటకు వెళ్లడం ఖాయం! అంటూ నవ్వుల గురించి గట్టిగా హామీ ఇచ్చారు.

ప్రియదర్శి, నిహారిక ఎన్ఎమ్, విష్ణు ఓయి, రాగ్ మయూర్, ప్రసాద్ బెహరా వంటి యంగ్ టాలెంట్‌తో పాటు, వెన్నెల కిషోర్, సత్య, వి.టి.వి. గణేష్ వంటి స్టార్ కమెడియన్లు ఉండడంతో… ‘మిత్ర మండలి’ పండించే నవ్వులు మామూలుగా ఉండవని అర్థమవుతోంది.

ALSO READ: https://teluguprabha.net/cinema-news/ntr-special-attraction-at-narne-nithin-shivani-wedding-event/

తాజాగా రిలీజ్ చేసిన ట్రైలర్ సినిమాపై ఉన్న అంచనాలను అమాంతం పెంచేసింది! ట్రైలర్ అంతా అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్‌టైనర్గా సాగింది. ట్రైలర్ చూసిన ప్రేక్షకులు ఇది కేవలం మిత్రులకు మాత్రమే కాదు, కుటుంబ సమేతంగా వెళ్లి చూడాల్సిన పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్ అని ఫిక్స్ అయిపోయారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad