Drishyam 3 Mohanlal: మలయాళంలో క్రైం థ్రిల్లర్ జోనర్‌లో వచ్చిన చిత్రం దృశ్యం.. దేశీయంగానే కాదు ప్రపంచవ్యాప్తంగా కూడా పలు భాషల్లో రిలీజై బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. సస్పెన్స్, థ్రిల్లింగ్ అంశాలతో ప్రేక్షకులను కుర్చీలకు కట్టిపడేసిన ఈ మూవీకి జీతూ జోసెఫ్ దర్శకత్వం వహించాడు. మళయాళంలో మోహన్ లాల్ (Mohan lal), మీనా కాంబోలో వచ్చిన దృశ్యం రెండు భాగాలు.. తెలుగులో వెంకటేష్, మీనా కాంబినేషన్‌లో వచ్చి అలరించింది.
Bringing Georgekutty’s world alive once again…
Today marks the beginning of Drishyam 3 with the Pooja.#Drishyam3 #JeethuJoseph #AashirvadCinemas #Drishyam pic.twitter.com/olQYQZR1WF— Mohanlal (@Mohanlal) September 22, 2025
కాగా ఇప్పుడు మరోసారి ట్విస్టులతో కూడిన థ్రిల్‌ను ప్రేక్షకులకు అందించేందుకు జీతూ జోసెఫ్ సిద్ధమయ్యారు. మూడో పార్టుకు సంబంధించిన అప్‌డేట్‌ను మేకర్స్ అందించారు. ఈ మేరకు దృశ్యం- 3 సోమవారం లాంచ్ అయింది. కేరళలోని పూతొట్ట లా కాలేజీలో మోహన్ లాల్, జీతూ జోసెఫ్ అండ్ టీం సమక్షంలో పూజా కార్యాక్రమాలతో దృశ్యం ఘనంగా ప్రారంభమైంది. అంతేకాకుండా రెగ్యులర్ షూటింగ్ కూడా మొదలైనట్టు సమాచారం. మూడో పార్టులో కూడా మీనానే మరోసారి తన పాత్రలో కనిపించనుంది.
Also Read: https://teluguprabha.net/cinema-news/pawan-kalyan-latest-og-movie-trailer-launch/
అయితే దృశ్యం- 3లో నటించే ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలపై త్వరలోనే చిత్ర బృందం క్లారిటీ ఇవ్వనుంది. మొత్తానికి సస్పెన్స్ థ్రిల్లర్స్‌ను ఇష్టపడే ఆడియన్స్ చాలా కాలంగా ఎదురుచూస్తున్న దృశ్యం మూడో పార్టుకు సంబంధించి క్రేజీ వార్తను మోహన్ లాల్ షేర్ చేసుకున్నారు.
‘జార్జ్‌కుట్టీ ప్రపంచంలోకి మరోసారి తీసుకొస్తూ’.. అంటూ మోహన్ లాల్ షేర్ చేసిన ఈ ఫొటో నెట్టింట వైరల్ అవుతోంది. ఆశీర్వాద్ సినిమాస్ దృశ్యం- 3ని తెరకెక్కిస్తోంది. కాగా దృశ్యం ప్రాంచైజీలో వచ్చిన రెండు పార్టుల్లో ఫస్ట్ పార్ట్ థియేటర్‌లో విడుదలవగా.. కరోనా నేపథ్యంలో రెండో పార్టు ఓటీటీలో విడుదలైంది.


