Mokshagna : నందమూరి అభిమానులు, సినీ ప్రియులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న నందమూరి మోక్షజ్ఞ సినీ ఎంట్రీ గురించి నటుడు నారా రోహిత్ కీలక వివరాలు పంచుకున్నారు. తాజాగా మోక్షజ్ఞ లుక్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన నారా రోహిత్, మోక్షజ్ఞ ఇండస్ట్రీలోకి రావడానికి ఉత్సాహంగా ఉన్నాడని చెప్పారు. “ఇటీవల మోక్షజ్ఞతో మాట్లాడినప్పుడు, అతను ఫీల్‌గుడ్ లవ్‌స్టోరీ కోసం స్క్రిప్ట్ వెతుకుతున్నాడని చెప్పాడు. ఈ ఏడాది చివర్లో లేదా 2026 ప్రారంభంలో అతని ఎంట్రీ ఉండవచ్చు,” అని రోహిత్ తెలిపారు. మోక్షజ్ఞ తన లుక్‌ను సినిమాల కోసమే మార్చుకున్నాడని, గతంతో పోలిస్తే ఇప్పుడు చాలా మార్పు వచ్చిందని అన్నారు.
ALSO READ: Hyderabad: రోజులు గడుస్తున్నా వీడని మిస్టరీ..సహస్రను చంపిందేవరు?
నందమూరి బాలకృష్ణతో మల్టీస్టారర్ సినిమా గురించి రోహిత్ మాట్లాడుతూ, గతంలో స్క్రిప్ట్ రెడీ చేశామని, లుక్ టెస్ట్ కూడా జరిగిందని చెప్పారు. కానీ, బాలకృష్ణ వరుస సినిమాలు, ఎన్నికల కారణంగా ఆ ప్రాజెక్ట్ ఆగిపోయిందని వెల్లడించారు. బాలకృష్ణ నటించిన ‘లెజెండ్’ సినిమాలో రోహిత్ అతిథి పాత్ర చేయాల్సి ఉంది, కానీ అది కుదరలేదు. “భవిష్యత్తులో బాలయ్యతో కలిసి నటించే అవకాశం వస్తే తప్పక చేస్తాను,” అని రోహిత్ ఆశాభావం వ్యక్తం చేశారు.
రోహిత్ నటించిన ‘సుందరకాండ’ సినిమా ఈ నెల 27న విడుదలకు సిద్ధంగా ఉంది. కొత్త దర్శకుడు వెంకటేశ్ నిమ్మలపూడి తెరకెక్కించిన ఈ చిత్రంలో శ్రీదేవి విజయ్‌కుమార్, వృతి వాఘని కథానాయికలు. ట్రైలర్ ఇప్పటికే ప్రేక్షకులను ఆకట్టుకుంది. హీరో పెళ్లి కష్టాల చుట్టూ తిరిగే కథ, ర్యాప్ సాంగ్‌తో సహా నవ్వులు పూయిస్తోంది. రోహిత్ రాజకీయ రంగంలోనూ సేవ చేయడానికి సిద్ధంగా ఉన్నానని, కార్యకర్తలను కలుస్తున్నానని చెప్పారు. మోక్షజ్ఞ ఎంట్రీ కోసం అభిమానుల ఆతృత కొనసాగుతోంది.


