Mrunal Thakur: మృణాల్ ఠాకూర్.. తెలుగుతో పాటు హిందీ భాషల్లో మోస్ట్ బిజీయెస్ట్ హీరోయిన్. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ చేతిలో ఐదు భారీ బడ్జెట్ సినిమాలు ఉన్నాయి. వరుసగా స్టార్ హీరోలతో సినిమాలు చేస్తోంది. సోషల్ మీడియాలో మృణాల్‌కు ఫాలోయింగ్ ఎక్కువే. ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమెకు పదిహేను మిలియన్ల ఫాలోయర్స్ ఉన్నారు. సోషల్ మీడియాలో హయ్యెస్ట్ ఫాలోయర్స్ ఉన్న హీరోయిన్లలో ఒకరిగా కొనసాగుతోంది. ప్రస్తుతం ఒక్కో సినిమా కోసం మృణాల్ ఠాకూర్ మూడు కోట్లకుపైనే రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు సమాచారం. అయితే ఈ స్టార్‌డమ్ ఓవర్‌నైట్‌లో రాలేదు.
సీరియల్స్‌తో…
ఇండస్ట్రీలో ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేకపోయినా ఒక్కో అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ టాప్ హీరోయిన్‌గా మారింది మృణాల్ ఠాకూర్. ఈ ముద్దుగుమ్మ యాక్టింగ్ కెరీర్ సీరియల్స్‌తో మొదలుకావడం గమనార్హం. ముఝ్‌సే కుఛ్ కెహతీ యే కామోషియాన్, అర్జున్ అనే సీరియల్స్‌లో చిన్న క్యారెక్టర్స్ చేసింది. ఆ తర్వాత కుంకుమభాగ్య సీరియల్‌లో సెకండ్ లీడ్‌గా ఛాన్స్ దక్కించుకున్నది. సైడ్ క్యారెక్టర్ అయినా సీరియల్ ద్వారానే మృణాల్ యాక్టింగ్ టాలెంట్ వెలుగులోకి వచ్చింది.
Also Read- Today Weather Updates: తెలంగాణలో విస్తారంగా వర్షాలు, కొన్ని జిల్లాలకు భారీ వర్ష సూచన..!
మరాఠీ సినిమాలు…
కుంకుమభాగ్య ద్వారా వచ్చిన పాపులారిటీతో కొన్ని మరాఠీ సినిమాల్లో మృణాల్ అవకాశాలు అందుకున్నది. అవేవీ అంతగా ఆడకపోవడంతో మళ్లీ టీవీల్లోకి రీఎంట్రీ ఇచ్చింది మృణాల్ ఠాకూర్. నాచ్‌బలియేతో పాటు మరికొన్ని రియాలిటీ షోస్‌లో కంటెస్టెంట్‌గా పాల్గొన్నది.
లవ్ సోనియా…
లవ్ సోనియా మూవీతో మృణాల్ యాక్టింగ్ కష్టాలకు పుల్‌స్టాప్ పడింది. ఈ సినిమాలో హ్యూమన్ ట్రాఫికింగ్ బారిన పడి ఇబ్బందులు పడే యువతిగా అసమాన నటనతో ఆకట్టుకుంది. ఆ తర్వాత సూపర్ 30, ఘోస్ట్ స్టోరీస్, జెర్సీ ఇలా ఒక్కో మెట్టు ఎక్కుతూ టాప్ స్టార్‌గా మారింది.
తెలుగులో సీతారామం…
సీతారామం మూవీతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది మృణాల్ ఠాకూర్. ఈ సినిమాలో సీతగా నాచురల్ యాక్టింగ్‌తో తెలుగు ప్రేక్షకుల మనసులను దోచేసింది. సీతారామంలో హీరోయిన్‌గా ఫస్ట్ ఛాయిస్ మృణాల్ ఠాకూర్ కాదు. తొలుత పూజాహెగ్డేను హీరోయిన్‌గా ఫైనల్ చేశారు మేకర్స్. కానీ డేట్స్ ఇష్యూ వల్ల ఆమె ఈ సినిమా నుంచి తప్పుకున్నది. ఆ తర్వాత రాశీఖన్నాను తీసుకోవాలని అనుకున్నారు. వర్కవుట్ కాకపోవడంతో మృణాల్‌కు అవకాశం దక్కింది. సీతారామం బ్లాక్‌బస్టర్‌తో తెలుగులో సెటిలైపోయింది. సీతారామం తర్వాత నానితో హాయ్ నాన్న, విజయ్ దేవరకొండతో ఫ్యామిలీ స్టార్ సినిమాలు చేసింది. ప్రభాస్ కల్కి మూవీలో గెస్ట్ రోల్‌లో కనిపించింది.
అల్లు అర్జున్ అట్లీ సినిమా…
ప్రస్తుతం అడివిశేష్ డెకాయిట్ షూటింగ్‌లో బిజీగా ఉంది మృణాల్ ఠాకూర్. తెలుగులో ఫస్ట్ టైమ్ యాక్షన్ రోల్‌లో కనిపించబోతున్నది. ఈ సినిమాతో పాటు అల్లు అర్జున్, అట్లీ మూవీలో ఓ హీరోయిన్‌గా మృణాల్ కనిపించబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. హిందీలో నాలుగు సినిమాల్లో నటిస్తుంది.


