Naga Chaitanya: గత ఏడాది డిసెంబర్‌లో పెళ్లిబంధంతో ఒక్కటయ్యారు నాగచైతన్య, శోభిత. పెళ్లికి ముందు రెండేళ్ల పాటు ప్రేమలో ఉన్నారు ఈ జంట. తమ లవ్‌స్టోరీ బయటపడకుండా ఇద్దరూ సీక్రెట్ మెయింటేన్ చేశారు. సడెన్‌గా ఎంగేజ్‌మెంట్ చేసుకొని అభిమానులకు షాకిచ్చారు. పెద్దల అంగీకారంతో హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోలో నాగచైతన్య, శోభిత పెళ్లి జరిగింది.
ఇన్‌స్టాగ్రామ్ ద్వారా…
శోభితతో ఫస్ట్ టైమ్ పరిచయం ఎలా జరిగిందో జయమ్ము నిశ్చయమ్మురా టాక్ షోలో నాగచైతన్య రివీల్ చేశాడు. జగపతిబాబు హోస్ట్‌గా వ్యవహరిస్తున్న ఈ టాక్ షోకు ఇటీవల నాగచైతన్య గెస్ట్‌గా హాజరయ్యాడు. ఈ షోలో తన కెరీర్‌తో పాటు వ్యక్తిగత జీవితానికి సంబంధించిన పలు ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. సోషల్ మీడియా తమ ప్రేమకథకు వారధిగా నిలిచిందని నాగచైతన్య చెప్పాడు. ‘‘నా జీవిత భాగస్వామి అయిన శోభితను ఇన్‌స్టాగ్రామ్ ద్వారా కలుస్తానని అస్సలు ఊహించలేదు. నేను ఒకసారి క్లౌడ్ కిచెన్ షో గురించి ఓ పోస్ట్ పెట్టా. ఆ పోస్ట్‌కు ఒక ఎమోజీతో శోభిత కామెంట్ పెట్టింది. ఆమె కామెంట్‌కు నేను రిప్లై ఇచ్చా. చాటింగ్ ద్వారా మా ఇద్దరి మధ్యస్నేహం మొదలైంది. ఆ తర్వాత అది ప్రేమగా మారింది’’ అని నాగచైతన్య అన్నారు.
Also Read – ED Raids: కార్ల స్మగ్లింగ్ కేసు – దుల్కర్ సల్మాన్, పృథ్వీరాజ్ సుకుమారన్ ఇళ్లపై ఈడీ దాడులు
మీరు ఏది లేకుండా జీవించలేరు అని ఈ షోలో జగపతిబాబు అడిగిన ప్రశ్నకు.. ‘నా భార్య లేకుండా ఉండలేను అని నాగచైతన్య సమాధానమిచ్చారు. శోభితనే నా బలం. నా జీవితంలో ఎక్కువగా ఇంపార్టెన్స్ శోభితకే ఇస్తాను’ అని నాగచైతన్య పేర్కొన్నారు. చైతూ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
సమంతతో విడాకులు…
కాగా నాగచైతన్యకు ఇది రెండో వివాహం. హీరోయిన్ సమంతను ప్రేమించిన నాగచైతన్య 2017లో ఆమెను పెళ్లిచేసుకున్నాడు. మనస్పర్థల కారణంగా 2021లో నాగచైతన్య, సమంత విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత శోభితతో ఏడడుగులు వేశాడు నాగచైతన్య. శోభితకు ఇది మొదటి వివాహం.
కాగా ప్రస్తుతం తెలుగులో నాగచైతన్య విరూపాక్ష దర్శకుడు కార్తీక్ వర్మ దండుతో ఓ సినిమా చేస్తున్నాడు. మిస్టిక్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ మూవీ షూటింగ్ తుది దశకు చేరుకుంది. బీవీఎస్ఎన్ ప్రసాద్‌తో కలిసి డైరెక్టర్ సుకుమార్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. మరోవైపు శోభిత తెలుగుతో పాటు తమిళంలో ఓ సినిమా చేస్తోంది.
Also Read – Nayanthara: నయనతారకు బాంబు బెదిరింపు! చెన్నైలో కలకలం


