Naga Chaitanya| అక్కినేని అందగాడు, యువసామ్రాట్ నాగచైతన్య(Naga Chaitanya), హీరోయిన్ శోభితా ధూళిపాళ్ల(Sobhita Dhulipala) జంట త్వరలోనే పెళ్లి పీటలెక్కనున్న సంగతి తెలిసిందే. కొంతకాంలగా ప్రేమలో ఉన్న వీరిద్దరి నిశ్చితార్థం ఇటీవల వేడుకగా జరిగిన విషయం విధితమే. ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. తాజాగా ఇద్దరు కలిసి ట్రెండీ లుక్స్‌లో ఓ ఫొటో దిగారు. ఈ ఫొటోను సోషల్ మీడియాలో అభిమానులతో చైతన్య పంచుకున్నారు. దీనికి ‘‘ఎవ్రిథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ వన్స్’’ అని క్యాప్షన్ ఇచ్చారు. అయితే ఈ ఫొటోకు కామెంట్స్ సెక్షన్ మాత్రం ఆఫ్ చేశారు. దీంతో కామెంట్స్ సెక్షన్ ఎందుకు ఆఫ్ చేశారంటూ నెటిజన్లు చర్చించుకున్నారు. కొంతమంది సమంత ఫ్యాన్స్ చై-శోభూ జంటపై నెగిటివ్ కామెంట్స్ చేస్తారనే ఉద్దేశంతోనే ఇలా చేశారని సన్నిహిత వర్గాలు పేర్కొంటున్నాయి.
కాగా చై-శోభిత ఎంగేజ్మెంట్ ఆగస్టు 8న కొద్దిమంది కుటుంబసభ్యుల సమక్షంలోనే జరిగింది. అయితే సన్నిహితుల సమక్షంలో ఎంగేజ్మెంట్ చేసుకోవడంపై ఇటీవల శోభిత స్పందించారు. ‘నిశ్చితార్థ వేడుక గ్రాండ్‌గా జరగాలని నేను ఎప్పుడూ ప్రణాళికలు వేసుకోలేదు. జీవితంలో ముఖ్యమైన ఆ క్షణాలను ఆస్వాదించాలని అనుకున్నా. తెలుగు సంప్రదాయాలకు అనుగుణంగా ఇలాంటి వేడుకలు జరగాలని ఎప్పుడూ అనుకునేదాన్ని. సంస్కృతి, సంప్రదాయాలకు నా తల్లిదండ్రులు ఎంతగానో విలువ ఇస్తారు. వాటితో నేను మమేకమయ్యాను. అనుకున్న విధంగానే సన్నిహితుల సమక్షంలో ఈ వేడుక ప్రశాంతంగా జరిగింది. అందమైన క్షణాలతో నా మనసు నిండింది. అది నిరాడంబరంగా జరిగిందని అనుకోవడం లేదు’ అని పేర్కొన్నారు.
ఇక వీరి సినిమాల విషయానికొస్తే చైతన్య ‘తండేల్’ చిత్రంలో నటిస్తున్నాడు. ఈ సినిమాకు కార్తీకేయ2 డైరెక్టర్ చందు మొండేటి దర్శకత్వం వహిస్తుండగా.. గీతా ఆర్ట్స్ బ్యానర్ మీద అల్లు అరవింత్ గ్రాండ్‌గా నిర్మిస్తున్నారు. ఈ మూవీలో చైకు జోడీగా సాయి పల్లవి నటిస్తోంది. వీరిద్దరు గతంలో ‘లవ్ స్టోరీ’ సినిమాలో నటించి అలరించారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడులైన పోస్టర్లు, టీజర్, లిరికల్ సాంగ్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. వచ్చే ఏడాది ప్రథమార్థంలో ఈ చిత్రం విడుదలకానున్నట్లు తెలుస్తోంది. ఇక శోభిత ‘గూడఛారి2’ సినిమాలో అడవి శేష్ సరసన నటిస్తోంది.