Naga Chaitanya: తండేల్ మూవీతో కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్‌ను అందుకున్నాడు నాగచైతన్య. చందూ మొండేటి దర్శకత్వంలో రూపొందిన ఈ రొమాంటిక్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ వంద కోట్ల వసూళ్లను దక్కించుకున్నది. ఈ సినిమాలో తండేల్ రాజు క్యారెక్టర్‌లో నాగచైతన్య అదరగొట్టాడు. నటుడిగా నాగచైతన్య కెరీర్‌లో బెస్ట్ మూవీ ఇదంటూ ఆడియెన్స్ నుంచి ప్రశంసలు వచ్చాయి.
కోలీవుడ్ డైరెక్టర్‌తో…
తండేల్ తర్వాత విరూపాక్ష దర్శకుడు కార్తీక్ దండుతో ఓ సినిమా చేస్తున్నాడు నాగచైతన్య. మైథలాజికల్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతోన్న ఈ మూవీ షూటింగ్‌తో బిజీగా ఉన్నాడు చైతూ. ఓ వైపు ఈ సినిమా చేస్తూనే కొత్త కథలు వింటున్నట్లు సమాచారం. తాజాగా సర్ధార్ ఫేమ్ పీఎస్ మిత్రన్ చెప్పిన ఓ కథ నాగచైతన్యకు తెగ నచ్చేసినట్లు టాలీవుడ్ సర్కిల్‌లో వార్తలు వినిపిస్తున్నాయి. గతంలో దక్షిణాదిలో వచ్చిన స్పై యాక్షన్ సినిమాలకు భిన్నంగా యూనిక్ పాయింట్‌తో దర్శకుడు సిద్ధం చేసిన కథకు ఫస్ట్ సిట్టింగ్‌లోనే నాగచైతన్య ఓకే చెప్పినట్లు ప్రచారం జరుగుతోంది. పాన్ ఇండియన్ లెవెల్‌లో నాగచైతన్య, పీఎస్ మిత్రన్ మూవీ రూపొందే అవకాశం ఉన్నట్లు చెబుతోన్నారు. అఖిల్‌తో ఏజెంట్ సినిమాను ప్రొడ్యూస్ చేసిన ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌లో ఈ మూవీ రూపొందనున్నట్లు చెబుతోన్నారు.
Also Read – Mega Fans: మెగా ఫ్యాన్స్‌ను భయపెడుతున్న అజ్ఞాతవాసి సెంటిమెంట్
సమంత మూవీతో…
విశాల్, సమంత హీరోహీరోయిన్లుగా నటించిన ఇరుంబుతిరై మూవీతో డైరెక్టర్‌గా కోలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు పీఎస్ మిత్రన్. ప్రస్తుతం కార్తీతో సర్ధార్ సీక్వెల్ మూవీ చేస్తున్నాడు. ఈ యాక్షన్ థ్రిల్లర్ మూవీలో కార్తీ డ్యూయల్‌రోల్‌లో కనిపించబోతున్నాడు. సర్ధార్ మూవీ పెద్ద హిట్టవ్వడంతో సీక్వెల్‌పై భారీగానే అంచనాలు ఏర్పడ్డాయి. సర్ధార్ కంటే ముందు శివకార్తికేయన్‌తో హీరో మూవీ చేశాడు. క్రైమ్ థ్రిల్లర్ మూవీస్ స్పెషలిస్ట్‌గా కోలీవుడ్‌లో పేరు తెచ్చుకున్నాడు పీఎస్ మిత్రన్.
సుకుమార్ ప్రొడ్యూసర్…
ప్రస్తుతం నాగచైతన్య, కార్తీక్ దండు మూవీ షూటింగ్ హైదరాబాద్‌లో జరుగుతోంది. ఈ మూవీ కోసం నాగచైతన్య ఫిజికల్‌గా చాలా మేకోవర్ అయినట్లు చెబుతోన్నారు. అతడి లుక్, బాడీలాంగ్వేజ్ కొత్తగా ఉంటాయని సమాచారం. నాగచైతన్య కెరీర్‌లో 24వ మూవీ ఇది. ఈ సినిమాను నిర్మాత బీవీఎస్ఎన్ ప్రసాద్‌తో కలిసి డైరెక్టర్ సుకుమార్ ప్రొడ్యూస్ చేస్తున్నారు. అజనీష్ లోకనాథ్ మ్యూజిక్ అందిస్తున్నాడు.
Also Read – SEBI Report : గతేడాది రిటైల్ ఇన్వెస్టర్లకు రూ.1.06 లక్షల కోట్ల నష్టం


