Jagapathi Babu Tv Show: ఓ వైపు సినిమాలు చేస్తూనే టాక్ షోలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు టాలీవుడ్ టాప్ స్టార్స్. బాలకృష్ణ అన్‌స్టాపబుల్ షో తెలుగులో ఓ ట్రెండ్ సెట్టర్‌గా నిలిచింది. నాగార్జున బిగ్‌బాస్‌కు హోస్ట్‌గా వ్యవహరిస్తున్నాడు. చిరంజీవి, నాని, ఎన్టీఆర్, మనోజ్‌తో పాటు పలువురు టాలీవుడ్ స్టార్స్ టీవీ షోస్ చేశారు. వీరి బాటలోనే మరో సీనియర్ హీరో అడుగులు వేయబోతున్నాడు. తెలుగులో మరో కొత్త టాక్ షో రాబోతుంది. జయమ్ము నిశ్చయమ్మురా పేరుతో జీ తెలుగులో టెలికాస్ట్ కానున్న ఈ టాక్ షోకు జగపతిబాబు హోస్ట్‌గా వ్యవహరించబోతున్నాడు. జగపతిబాబు బుల్లి తెరపై అడుగు పెట్టటం కొత్తేమీ కాదు. గతంలో జెమినీ టీవీలో ప్రసారమైన ఓ గేమ్ షోకు జగపతి బాబు హోస్ట్ గా వ్యవహరించారు. అయితే ఆ షో సక్సెస్ కాకపోవటంతో ఆగిపోయింది. తర్వాత జగపతిబాబు సినిమాలకు మధ్యలో కాస్త గ్యాప్ వచ్చింది. తర్వాత ఆయన క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, విలన్ గా రాణిస్తున్నారు.
నాగార్జున గెస్ట్…
జయమ్ము నిశ్చయమ్మురా టాక్ షో లాంఛింగ్ డేట్‌తో పాటు ఫస్ట్ గెస్ట్ ఎవరన్నది జీ తెలుగు రివీల్ చేసింది. ఆగస్ట్ 17 నుంచి జయమ్ము నిశ్చయమ్మురా మొదలుకాబోతుంది. ఈ టాక్ షోకు ఫస్ట్ గెస్ట్‌గా టాలీవుడ్ స్టార్ హీరో నాగార్జున రాబోతున్నాడు. నాగార్జునతో పాటు ఆయన సోదరుడు అక్కినేని వెంకట్, సోదరి నాగసుశీల కోసం ఈ షోలో సందడి చేయబోతున్నారు.
కూలీలో విలన్‌గా…
హీరోగా తన సినీ ప్రయాణం గురించి జయమ్మునిశ్చయమ్మురా షోలో పలు ఇంట్రెస్టింగ్ విషయాలను నాగార్జున రివీల్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. వ్యక్తిగత జీవితం, వెంకట్, నాగసుశీలతో అనుబంధం గురించి చెప్పబోతున్నట్లు సమాచారం. శివ సినిమా వివరాలతో పాటు కూలీ మూవీలో విలన్‌గా నటించడానికి గల కారణాలను వెల్లడించబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది.
కల్కి, జగదేకవీరుడు…
తెలుగులో కల్కి, జగదేకవీరుడు అతిలోక సుందరి వంటి కల్క్ క్లాసిక్ సినిమాలను నిర్మించిన వైజయంతీ మూవీస్ సంస్థ జయమ్ము నిశ్చయమ్మురా టాక్ షోను ప్రొడ్యూస్ చేస్తోంది. స్వప్న దత్, ప్రియాంక దత్ ఈ షోను నిర్మిస్తున్నారు. రానున్న రోజుల్లో చిరంజీవి, నాని, విజయ్ దేవరకొండతో పాటు పలువురు టాప్ హీరోలు ఈ షోకు గెస్ట్‌లుగా రానున్నట్లు ప్రచారం జరుగుతోంది.
విలన్‌గా బిజీ…
జయమ్ము నిశ్చయమ్మురా ద్వారానే జగపతిబాబు హోస్ట్‌గా ఎంట్రీ ఇస్తున్నాడు. హీరోగా కెరీర్‌ను మొదలుపెట్టిన జగపతిబాబు ప్రస్తుతం సెకండ్ ఇన్నింగ్స్‌లో విలన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా నటిస్తున్నాడు. ప్రస్తుతం రామ్‌చరణ్ పెద్ది మూవీలో ఓ కీలక పాత్రలో కనిపించబోతున్నాడు. తమిళం, మలయాళ భాషల్లో సినిమాలు చేస్తున్నాడు.
ALSO READ : https://teluguprabha.net/cinema-news/pooja-hegde-re-entry-into-bollywood-with-nithin-vikram-kumar-movie/


