యువసామ్రాట్ నాగ చైతన్య (Naga Chaitanya), హీరోయిన్ సాయి పల్లవి (Sai Pallavi) ప్రధాన పాత్రల్లో రూపొందుతున్న సినిమా ‘తండేల్’ (Thandel). వాస్తవ సంఘటనల ఆధారంగా చందూ మొండేటి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ఫిబ్రవరి 7న విడుదల కానుంది. ఇప్పటికే చిత్ర బృందం విడుదల చేసిన ‘బుజ్జి తల్లి’ (Bujji Thalli) లిరికల్ సాంగ్ యువతను ఓ ఊపు ఊపేస్తుండగా.. తాజాగా ‘నమో నమో నమః శివాయ..’(Namo Namah Shivaya) అంటూ సాగే శివశక్తి పాటను విడుదల చేశారు. ప్రస్తుతం ఈ పాట యూట్యూబ్‌లో ట్రెండ్ అవుతుంది. ఈ పాటకు జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు సాహిత్యం అందించగా..అనురాగ్ కులకర్ణి, హరిప్రియ అద్భుతంగా పాడారు. రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ ఈ సినిమాకు సంగీతం అందించగా..ప్రముఖ నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తోంది.
కాగా శ్రీకాకుళం మత్స్యకారుల జీవితం నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమాలో చైతన్య మత్సకారుడి పాత్ర పోషిస్తున్నారు. శ్రీకాకుళం నుంచి సముద్రంలో చేపల వేటకు వెళ్లిన మత్స్యకారులు పాకిస్థాన్ పోలీసులకు చిక్కుతారు. ఆ తర్వాత ఏం అయిందనే ఆధారంగా సినిమాను రూపొందిస్తున్నారు.