Sunday, November 16, 2025
Homeచిత్ర ప్రభSundarakanda OTT: ఓటీటీలోకి నారా రోహిత్ రొమాంటిక్ ల‌వ్ స్టోరీ సుంద‌రకాండ - స్ట్రీమింగ్ డేట్...

Sundarakanda OTT: ఓటీటీలోకి నారా రోహిత్ రొమాంటిక్ ల‌వ్ స్టోరీ సుంద‌రకాండ – స్ట్రీమింగ్ డేట్ ఇదే!

Sundarakanda OTT: నారా రోహిత్ హీరోగా న‌టించిన లేటెస్ట్ మూవీ సుంద‌రకాండ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స‌య్యింది. రొమాంటిక్ ల‌వ్ డ్రామాగా తెర‌కెక్కిన ఈ సినిమాకు వెంక‌టేష్ నిమ్మ‌ల‌పూడి ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. సుంద‌ర‌కాండ మూవీలో శ్రీదేవి విజ‌య్‌కుమార్‌, వృతి వాఘాని హీరోయిన్లుగా క‌నిపించారు. వినాయ‌కచ‌వితి కానుక‌గా ఆగ‌స్ట్ నెలాఖ‌రున ప్రేక్ష‌కుల ముందుకొచ్చిన ఈ మూవీ మిక్స్‌డ్ టాక్‌ను సొంతం చేసుకుంది.

- Advertisement -

జియో హాట్ స్టార్‌లో…
థియేట‌ర్ల‌లో రిలీజై నెలరోజులు కూడా కాక‌ముందే సుంద‌ర‌కాండ ఓటీటీలోకి వ‌స్తోంది. సెప్టెంబ‌ర్ 23 నుంచి జియో హాట్ స్టార్‌లో ఈ ట్ర‌యాంగిల్ ల‌వ్‌స్టోరీ స్ట్రీమింగ్ కాబోతుంది. రిలీజ్ డేట్‌ను అఫీషియ‌ల్‌గా ప్ర‌క‌టించిన జియో హాట్‌స్టార్ ఓ పోస్ట‌ర్‌ను అభిమానుల‌తో పంచుకున్న‌ది.

Also Read- Bigg Boss Voting: ఓటింగ్ లో దూసకుపోతున్న కమెడియన్.. ఈ వారం ఎలిమినేట్ అయ్యేదెవరంటే?

కాన్సెప్ట్ బాగున్నా…
కాన్సెప్ట్‌, కామెడీ బాగుంద‌నే టాక్ వ‌చ్చినా క‌మ‌ర్షియ‌ల్‌గా సుంద‌ర‌కాండ యావ‌రేజ్‌గా నిలిచింది. టిఫిక‌ల్ స్టోరీని డ‌బుల్ మీనింగ్ డైలాగ్స్‌, బూతు స‌న్నివేశాలు లేకుండా క్లీన్‌గా ద‌ర్శ‌కుడు ఈ సినిమాలో చూపించాడ‌ని కామెంట్స్ వినిపించాయి. థియేట‌ర్ల‌లో స‌త్య కామెడీ బాగా వ‌ర్క‌వుట్ అయ్యింది. సుంద‌ర‌కాండ సినిమాతోనే వెంక‌టేష్ నిమ్మ‌ల‌పూడి డైరెక్ట‌ర్‌గా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఈ సినిమాకు అత‌డే మ్యూజిక్ కూడా అందించాడు.

సుంద‌ర‌కాండ క‌థ ఏంటంటే?
సిద్ధార్థ్ (నారా రోహిత్‌) ఓ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌, న‌ల‌భై ఏళ్ల వ‌య‌సొచ్చిన త‌న‌కు న‌చ్చే క్వాలిటీస్ ఉన్న అమ్మాయి దొర‌క‌లేదంటూ పెళ్లి చేసుకోకుండా ఉండిపోతాడు. స్కూల్ డేస్‌లో వైష్ణ‌విని (శ్రీదేవి విజ‌య్‌కుమార్‌) ఇష్ట‌ప‌డ‌తాడు. ఆమె మ‌రొక‌రిని పెళ్లిచేసుకొని సిద్ధార్థ్‌కు దూర‌మ‌వుతుంది. ఆ త‌ర్వాత ఐరా (శృతి వాఘాని) సిద్ధార్థ్ లైఫ్‌లోకి వ‌స్తుంది. ఐరాను పెళ్లిచేసుకోవాల‌ని అనుకుంటాడు. అప్పుడే ఐరాకు, వైష్ణ‌వికి సంబంధం ఉంద‌నే షాకింగ్ న్యూస్ సిద్ధార్థ్‌కు తెలుస్తుంది? అదేమిటి? వైష్ణ‌వికి, సిద్ధార్థ్ ఎందుకు దూర‌మ‌య్యాడు అన్న‌దే ఈ మూవీ క‌థ‌.

Also Read- Astrology: బుధుడు, శని గ్రహాల కలయిక.. ఇవాల్టి నుండి ఈ 3 రాశుల వారికి తిరుగులేదు ఇక..

రీఎంట్రీ…
ఫ్లాప్‌ల కార‌ణంగా 2018లో రిలీజైన వీర‌భోగ‌వ‌సంత‌రాయ‌లు త‌ర్వాత టాలీవుడ్‌కు దూర‌మ‌య్యాడు నారా రోహిత్‌. గ‌త ఏడాది వ‌చ్చిన ప్ర‌తినిధి 2తో రీఎంట్రీ ఇచ్చాడు. ఇటీవ‌ల ప్రేక్ష‌కుల ముందుకొచ్చిన భైర‌వం సినిమాలో ఓ హీరోగా క‌నిపించాడు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad