Saturday, February 22, 2025
Homeచిత్ర ప్రభNargis Fakhri: రహస్య వివాహం చేసుకున్న నర్గీస్ ఫక్రి

Nargis Fakhri: రహస్య వివాహం చేసుకున్న నర్గీస్ ఫక్రి

మనోహరి ..సాంగ్ గుర్తుందా

నర్గిస్ ఫక్రి, ఈ పేరు పెద్దగా పరిచయం అక్కర్లేదు. చెప్పేందుకు బాలీవుడ్ లో బిజీ డ్యాన్సర్ అనే మాటే కానీ ఈమె డ్యాన్స్ అంటే ఇండియన్స్ అందరికీ చాలా ఇష్టం. తెలుగుసహా పలు భాషల్లో మంచి సాంగ్స్ కు డ్యాన్స్ చేసిన ఈమె ప్రస్తుతం హరిహర వీరమల్లులో కూడా యాక్ట్ చేస్తున్నారు.

- Advertisement -

టోనీ బేగ్ అనే వ్యక్తితో మూడేళ్లుగా డేటింగ్ లో ఉన్న నర్గీస్ లాస్ ఏంజిలెస్ లో సీక్రెట్ గా మ్యారేజ్ చేసుకున్నారు. వీళ్ల వెడ్డింగ్ కేక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కేవలం కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల మధ్య వీరు వివాహం చేసుకుని హనీమూన్ కు స్విట్జర్లాండ్ వెెళ్లారు. కశ్మీరీ బిజినెస్ మ్యాన్ అయిన టోనీ లాస్ ఏంజిలెస్ లో ఉంటున్నారు.

అమెరికన్ అయిన నర్గీస్ బాలీవుడ్ మూవీ రాక్ స్టార్ తో ఎంట్రీ ఇచ్చారు. ఆతరువాత డ్యాన్స్ షోలకు జడ్జిగా, స్పెషల్ సాంగ్స్ డ్యాన్సర్ గా, మ్యూజిక్ కాన్సర్ట్స్, స్పోర్ట్స్ ఈవెంట్ లో కళ్లు చెదిరే డ్యాన్స్ షోలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపును, అభిమానులను సంపాదించుకున్నారు నర్గీస్. బాహుబలిలో మనోహరి సాంగ్ చేసిన నర్గీస్ మనవాళ్లకు ఫేవరెట్ డ్యాన్సర్ కూడా.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News