Thursday, April 18, 2024
Homeచిత్ర ప్రభNavdeep shocking style: నవదీప్ షాకింగ్ స్టైల్

Navdeep shocking style: నవదీప్ షాకింగ్ స్టైల్

లవ్,మౌళిలో నవదీప్ స్టన్నింగ్ గెటప్

సూప‌ర్ టాలెంటెడ్ యాక్టర్ నవదీప్ కొంత విరామం తరువాత హీరోగా, స‌రికొత్త‌గా న‌వ‌దీప్ గా 2.Oగా క‌నిపించ‌బోతున్న చిత్రం లవ్,మౌళి. విభిన్న‌మైన, వైవిధ్య‌మైన ఈ చిత్రానికి అవ‌నీంద్ర ద‌ర్శ‌కుడు. ఈ చిత్రాన్ని నైరా క్రియేషన్స్ మరియు శ్రీకర స్టూడియోస్ బ్యానర్స్ తో క‌లిసి నిర్మాణ పనులు టాలీవుడ్ టాలెంటెడ్ టెక్నిషియన్స్ కి అడ్డాగా మారిన సి స్పేస్ భాధ్యతలు తీసుకుంది.

- Advertisement -

ఈ చిత్రం నుంచి వ‌చ్చిన ప్ర‌తి అప్‌డేట్ వినూత్నంగా అంద‌రిని ఆక‌ట్టుకుంటున్న సంగ‌తి తెలిసిందే. తాజాగా ఈ చిత్రాన్ని ఏప్రిల్ 19న విడుద‌ల చేస్తున్నట్లు ప్ర‌క‌టించింది చిత్ర‌యూనిట్‌. ఈ సంద‌ర్భంగా ద‌ర్శ‌కుడు మాట్లాడుతూ ఈ చిత్రంలో చాలా డిఫ‌రెంట్‌గా నవదీప్ కనిపించడంతో ఈ సినిమా న‌వ‌దీప్ 2.Oగా అభిమానులంతాఒక ఢిఫరెంట్ కాన్నెప్ట్ తొ వుంటుంద‌ని మంచి అంచ‌నాల‌తో ఈ సినిమా గురించి ఎదురుచూస్తున్నారు. నేడు విడుద‌లైన పాట‌ల‌ను చూస్తుంటే వీరి అంచ‌నాల‌ను మ‌రింత పెంచే విధంగా వుంది. ఎందుకుంటే న‌వ‌దీప్‌ను స‌రికొత్త‌గా చూసిన వాళ్లంతా ఈసినిమాతో ఆయ‌న కొత్త ట్రెండ్ క్రియేట్ చెయ్య‌బోతున్నాడ‌ని అంటున్నారు.

నా లైఫ్ లో జ‌రిగిన ప్రేమ‌క‌థ‌ల‌కు ఫ‌లిత‌మే ఈ సినిమా క‌థ‌. నేను పాన్ ఇండియా లెవ‌ల్‌లో ప్రేమించేవాడ్ని. ప్రేమ అనే టాపిక్‌లో సో మెనీ వెరియేష‌న్స్ వున్నాయి. నా స్వీయ అనుభ‌వాలే ఈ సినిమా క‌థ, ఈ నెల 19న చిత్రాన్ని విడుద‌ల చేస్తున్నాం. విభిన్న ప్రేమ‌క‌థ‌లు కోరుకునే ప్రేక్ష‌కులంద‌రికి మా ల‌వ్‌, మౌళి మ‌న‌సుల‌కు హ‌త్తుకుంటుంది అన్నారు. నవదీప్, పంఖురి గిద్వానీ, భావన సాగి, మిర్చి హేమంత్, మిర్చి కిరణ్ తదితరులు ఈ సినిమాలో నటించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News