Nayanthara| తన డాక్యుమెంటరీ విషయంలో హీరో ధనుష్ (Dhanush)తో హీరోయిన్ నయనతారకు వివాదం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కర్మ సిద్ధాంతాన్ని ఉద్దేశించి నయనతార సోషల్ మీడియాలో పెట్టిన ఓ పోస్ట్ వైరల్‌గా మారింది. ‘‘అబద్ధాలతో పక్క వారి జీవితాన్ని నాశనం చేస్తే.. దానిని మీరొక అప్పుగా భావించండి. ఏదో ఒకరోజు మీకు వడ్డీతో సహా తిరిగి వస్తుందని గుర్తుపెట్టుకోండి’’ అని ఆ పోస్టులో ఉంది. దీంతో నయన్ పోస్టులపై రకరకాల చర్చ జరుగుతోంది. ధనుష్‌కు కౌంటర్‌గానే ఈ పోస్టు పెట్టినట్లు కొంతమంది నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
కాగా ప్రముఖ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్ రూపొందించిన నయనతార డాక్యుమెంటరీలో ‘నానుమ్ రౌడీ దాన్’ పాటలు వినియోగించుకోవడానికి అవకాశం ఇవ్వకపోవడంపై ధనుష్‌కు నయనతార బహిరంగ లేఖ రాశారు. ఈ లేఖలో ఆయనతో తీవ్ర విమర్శలు చేశారు నయన్. మూడు సెకన్ల క్లిప్స్ వాడుకున్నందుకు దాదాపు రూ.10 కోట్లు డిమాండ్ చేయడం విచారకరమని మండిపడ్డారు. మరోవైపు నయన్ భర్త, దర్శకుడు విఘ్నేశ్ కూడా ధనుష్ తీరుపై మండిపడ్డారు. ధనుష్ మంచివాడు కాదంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలోనే ధనుష్ నయనతార దంపతులపై హైకోర్టులో దావా వేశారు.