Monday, October 21, 2024
Homeచిత్ర ప్రభPRABHAS: 'ది రాజాసాబ్' నుంచి అదిరిపోయే అప్టేట్.. స్టైలిష్‌ లుక్‌లో దుమ్మురేపుతున్న ప్రభాస్

PRABHAS: ‘ది రాజాసాబ్’ నుంచి అదిరిపోయే అప్టేట్.. స్టైలిష్‌ లుక్‌లో దుమ్మురేపుతున్న ప్రభాస్

PRABHAS| పాన్ ఇండియా స్టార్ హీరో, రెబల్ స్టార్ ప్రభాస్ అభిమానులకు అదిరిపోయే ట్రీట్ వచ్చేసింది. దర్శకుడు మారుతి దర్శకత్వంలో ప్రభాస్(PRABHAS) నటిస్తోన్న హర్రర్ కామెడీ చిత్రం ‘ది రాజాసాబ్’ నుంచి కీలక అప్డేట్ ఇచ్చారు మేకర్స్. ఎల్లుండి(బుధవారం) డార్లింగ్ పుట్టినరోజు సందర్భంగా విషెష్ తెలియజేస్తూ.. స్పెషల్ పోస్టర్ విడుదల చేశారు.

- Advertisement -

ఈ నెల 23న రాయల్‌ ట్రీట్‌ (టీజర్‌/ట్రైలర్‌ రిలీజ్‌) ఇవ్వనున్నట్టు ప్రకటించింది. ఈ పోస్టర్‌లో ప్రభాస్ లుక్ దుమ్మురేపుతోంది. గళ్ల చొక్కా, కళ్లద్దాలు పెట్టుకుని స్టైలిష్ లుక్‌లో మెరిసిపోతున్నాడు. దీంతో అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఈ లుక్‌లో తమ హీరో అదిపోయాడంటూ కామెంట్స్ చేస్తున్నారు. కాగా ఈ సినిమా 2025 ఏప్రిల్ 10న ప్రపంచవ్యాప్తంగా విడుదలకానుంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News