Saturday, May 18, 2024
Homeచిత్ర ప్రభఏ కన్నుకి ఏ స్వప్నమో .. ఏ రెప్పలైనా తెలిపేనా.. 18 పేజెస్ నుండి కొత్త...

ఏ కన్నుకి ఏ స్వప్నమో .. ఏ రెప్పలైనా తెలిపేనా.. 18 పేజెస్ నుండి కొత్త పాట

కార్తికేయ -2 సినిమాతో పాన్ ఇండియా హిట్ కొట్టిన నిఖిల్-అనుపమ పరమేశ్వర్ జంటగా వస్తున్న సినిమా ’18 పేజెస్’. గీతా ఆర్ట్స్ 2, సుకుమార్ కలిసి నిర్మించిన ఈ సినిమాకు సుక్కు శిష్యుడు పల్నాటి సూర్యప్రతాప్ దర్శకత్వం వహించారు. సుకుమార్ కథ రాశారు. విభిన్నమైన ప్రేమ కథాచిత్రంగా వస్తున్న ఈ సినిమాకు గోపీసుందర్ సంగీతాన్ని సమకూర్చాడు. తాజాగా ఈ సినిమా నుండి ‘నన్నయరాసిన’ లిరికల్ సాంగ్ ను విడుదల చేసింది చిత్రబృందం.

- Advertisement -

‘ఏ కన్నుకి ఏ స్వప్నమో .. ఏ రెప్పలైనా తెలిపేనా, ఏ నడకది ఏ పయనమో ఏ పాదమైనా చూపేనా’ అంటూ సాగే ఈ పాట మెలోడీ శ్రోతలను అలరిస్తోంది. శ్రీమణి సాహిత్యాన్ని అందించిన ఈ పాటను పృథ్వీ చంద్ర – సితార ఆలపించగా.. ప్రేమ్ రక్షిత్ కొరియోగ్రఫీ చేశారు. కార్తికేయ -2 వంటి హిట్ తర్వాత అదే జోడి కాంబినేషన్లో వస్తున్న సినిమా కావడంతో.. సాధారణంగానే అంచనాలున్నాయి. డిసెంబర్ 23న ’18 పేజెస్’ థియేటర్లలో విడుదలై తన అదృష్టాన్ని పరీక్షించుకోనుంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News