Saturday, June 29, 2024
Homeచిత్ర ప్రభNikhil most awaited Pan India Swayambhu: మారేడుమిల్లిలో నిఖిల్ 'స్వయంభూ'

Nikhil most awaited Pan India Swayambhu: మారేడుమిల్లిలో నిఖిల్ ‘స్వయంభూ’

లెజెండరీ వారియర్ గా నిఖిల్

నిఖిల్, భారత్ కృష్ణమాచారి, పిక్సెల్ స్టూడియో పాన్ ఇండియా ప్రాజెక్ట్ స్వయంభూ కొత్త షెడ్యూల్ మారేడుమిల్లిలో ప్రారంభం

- Advertisement -

నిఖిల్ మోస్ట్ ఎవైటెడ్ పాన్-ఇండియా ప్రాజెక్ట్ ‘స్వయంభూ’ మారేడుమిల్లిలోని బ్యూటీఫుల్ లోకేషన్స్ లో కొత్త షూటింగ్ షెడ్యూల్‌ ప్రారంభమైయింది.

మారేడుమిల్లిలోని దట్టమైన అడవులలో నిఖిల్ పై కొన్ని కీలక సన్నివేశాలను ఈ షెడ్యూల్ లో చిత్రీకరిస్తున్నారు. ఈ సన్నివేశాలు నెరేటివ్ కి కీలకం, ఛాలెంజ్ తో కూడిన లాండ్ స్కేప్ మూవీ అథెంటిసిటీ, ఇంటన్సిటీని పెంచుతుంది.

ట్యాలెంటెడ్ భరత్ కృష్ణమాచారి దర్శకత్వం వహిస్తున్న ‘స్వయంభూ’ నిఖిల్ 20వ మైల్ స్టోన్ మూవీగా గొప్ప సినిమాటిక్ ఎక్స్ పీరియన్స్ ని ప్రామిస్ చేస్తూ గ్రాండ్ స్కేల్ లో తెరకెక్కుతున్న పీరియాడికల్ ఫిల్మ్.

నిఖిల్ లెజెండరీ వారియర్ పాత్రను పోషిస్తున్నారు, ఈ పాత్ర కోసం నిఖిల్ ఇంటెన్స్ ట్రైనింగ్ తీసుకున్నారు. పాత్ర పట్ల అతని అంకితభావం, డైనమిక్ పెర్ఫార్మెన్స్ ని తెరపైకి తీసుకొస్తోంది.

ఈ మూవీ లో సంయుక్త, నభా నటేష్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు.

ఈ చిత్రానికి టాప్ టెక్నిషియన్స్ పని చేస్తున్నారు. రవి బస్రూర్ సంగీతం సమకూర్చగా, కెకె సెంథిల్ కుమార్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ఎం ప్రభాకరన్ ప్రొడక్షన్ డిజైనర్.

ఠాగూర్ మధు సమర్పణలో పిక్సెల్ స్టూడియోస్ పతాకంపై భువన్, శ్రీకర్ నిర్మిస్తున్న ‘స్వయంభూ’ అత్యున్నత ప్రొడక్షన్ వాల్యూస్, టెక్నికల్ స్టాండర్డ్స్ తో రూపొందుతోంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News